జనరల్ డెస్క్: (తెలుగు న్యూస్ పవర్. కామ్)
మహారాష్ట్రకు చెంది నూతన జంట సనాత ధర్మానికి, ఆధ్యాత్మిక విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. వివాహం అనంతరం హనీమూన్ కు చెక్ చేయకుండా, తీర్థయాత్రల బాట పట్టారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాల దర్శనం కోసం చెప్పులు లేకుండా సుదీర్ఘ పాదయాత్ర భక్త లోకాన్ని కదిలించింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన అజిత్ జగతాప్, ప్రియాంక జగతాప్ దంపతులు శివునిపై భక్తితో ఈ యాత్రను ప్రారంభించారు. సుమారు తొమ్మిది నెలల పాటు సాగిన ఈ పాదయాత్రలో వారు దాదాపు 11,600 కిలోమీటర్లు ప్రయాణించి దేశవ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగాలను దర్శించారు.
ప్రతిరోజూ 30 నుంచి 40 కిలోమీటర్ల మేర నడుస్తూ, ఎండకు ఎండి, వానకు తడిచి, చలిలో వణికి, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నా.తమ సంకల్పాన్ని విడలేదు. యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు.
గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ వరకు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం నుంచి తమిళనాడులోని రామేశ్వరం వరకు వివిధ రాష్ట్రాల్లోని పవిత్ర శైవ క్షేత్రాలను వారు సందర్శించారు.
ఈ సందర్భంగా అజిత్, ప్రియాంక మాట్లాడుతూ, శివుడిపై ఉన్న అచంచల విశ్వాసమే తమకు ఈ యాత్రను పూర్తి చేసే శక్తిని ఇచ్చిందన్నారు. యాత్రలో ఎదురైన ఆకలి, అలసట, శారీరక ఇబ్బందులను భక్తి, సంకల్పబలం ఇచ్చాయని తెలిపారు.వారి యాత్ర కేవలం మతపరమైన కార్యక్రమం మాత్రమే కాకుండా, పట్టుదల, భాగస్వామ్య బలం, భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల పట్ల గౌరవానికి ప్రతీకగా నిలిచిందని పలువురు ధార్మికవేత్తలు, భక్తులు అభిప్రాయపడుతున్నారు.
ఈ దంపతుల అసాధారణ సాధన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది. అచంచలమైన సంకల్పం ఉంటే అసాధ్యమనుకున్న లక్ష్యాలనూ సాధించవచ్చని వారి ప్రయాణం మరోసారి నిరూపించింది.
నూతన దంపతులు జ్యోతిర్లింగాల దర్శనం. చెప్పులు లేకుండా11,600 కి.మీ. నడక.
జ్యోతిర్లింగాల పాదయాత్ర నూతన జంట.