Telugu News Power

పెద గోపురంలో లక్ష్మీ గణపతి హోమం.

లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్న భక్తులు

పాలకొల్లు: జూన్,4(తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణములో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో సంకటహర చతుర్థి సందర్భంగా, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, భక్తిశ్రద్ధలతో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి పూజలు గురువారం జరుపుకున్నారు. లక్ష్మీ గణపతి హోమం పూజలు అభిషేక పండితులు బమ్మిడిపాటి వెంకన్న, భక్తులతో పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సూపర్నెంట్ వాసు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు