పాలకొల్లు: జూన్, 22( తెలుగు న్యూస్ పవర్. కామ)
స్థానిక బి ఆర్ ఆర్, జి కే ఆర్ చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో సోమవారం దివిస్ లాబొరేటరీస్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో 40మంది అభ్యర్థులు ఎంపికైయ్యారు. వారిలో 12 మంది ఛాంబర్స్ విద్యార్థులని, కళాశాల చైర్మన్ కారుమూరి నరసింహ రావు తెలిపారు.ఈ ప్రాంగణం ఎంపికులకు వివిధ ప్రాంతాల నుండి 60 మంది అభ్యర్థుల హాజరైయ్యారు. ప్రిన్సిపల్ డాక్టర్ డి. వెంకటేశ్వరరావు. సెక్రటరీ కె.వి సీతారామరాజు, ట్రెజరర్ ఆర్. ప్రవీణ్ భాను, అకాడమిక్ అడ్వైజర్స్ డాక్టర్ ఎబిఎస్ మూర్తి , ఎన్ సీతారామ రావు, హెచ్ఆర్ రాజేష్ ప్లేస్మెంట్ అధికారులు యు. జానకి రామయ్య మరియు టి మీన మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఛాంబర్స్ కళాశాల ప్రాంగణ ఎంపికల్లో 40 మంది ఎంపిక.
అభ్యర్థులకు సూచనలు ఇస్తున్న ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు