పాలకొల్లు:ఆగస్టు,30( తెలుగు న్యూస్ పవర్. కామ్) యాదవ ఎడ్యుకేషన్ సొసైటీ (వై ఇ ఎస్) ఆధ్వర్యంలో ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల సరస్వతి శిశు మందిర్ లో ఈ కార్యక్రమం ఆదివారం జరిగింది. గత రెండు దశాబ్దాలుగా, విద్యార్థులను ప్రోత్సహించే ఈ కార్యక్రమం నిర్వాహకులు అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. యాదవ్ విద్యార్థులకు 80శాతం, ఇతరులకు 20 శాతం ఈ స్కాలర్షిప్లు అందజేస్తున్నారు. 30 మందికి రూ.45,000లు విరాళంతో ప్రతి విద్యార్థికి రెండు రూ. 2 వేల నగదు, ఫైలు, ప్రశంసా పత్రం, మేమెంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవ, విద్యారంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా సత్కారం చేస్తున్నారు. సామాజిక సేవ విభాగం లో చెన్నం చంద్రమోహన్రావు, పోస్టల్ శాఖ భీమవరం వారికి, వైన్ కళాశాల (బిఈడి) గుత్తి రాధ, విద్యా రంగం తరఫున ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వీరి ప్రసంగాలు, లోతైన అధ్యయనంతో, స్ఫూర్తివంతంగా సాగాయి. రిటైర్డ్ లైబ్రేరియాన్ దాట్ల భీమరాజు( వెంప) విద్యార్థుల ఫైల్స్ సౌజన్యం అందించారు. విద్యార్థుల ఈ బృహత్తర కార్యక్రమానికి, ప్రభుత్వ కళాశాల గ్రంథపాలకులు డాక్టర్. ఆవాల పెద్దిరాజు కన్వీనర్ గా వ్యవహరించారు. అధ్యక్షులు, కొండ్రు శ్రీనివాస్, కార్యదర్శి మురుకిత శివకుమార్, వివిధ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
యాదవ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలు.