Telugu News Power

పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. -కలెక్టర్ పిలుపు.

పోలియో కార్యక్రమం గోడ పత్రిక ఆవిష్కరిస్తున్న కలెక్టర్, అధికారులు

భీమవరం: జూన్, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఈ నెల 28న పల్స్ పోలియో కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 0-5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేస్తారు. ఇందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 1,151 పోలియో చుక్కలు వేసే కేంద్రలు ఏర్పాటు చేసారు. జిల్లాలో 1.74 లక్షలకుపైగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు.

“ప్రతిసారి రెండు చుక్కలు.. పోలియోపై నిరంతరంగా విజయం” అనే సందేశంతో ప్రతి చిన్నారి ఆరోగ్య భద్రత కోసం ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసారు. స్థానిక స్వచ్చంద సంస్థలు తమ సహాకారం అందిచాలని కోరారు.