అమరావతి: జూన్, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని కూటమి ప్రభుత్వం నియమించింది. శ్రీలక్ష్మి 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. ఈమెను సాధారణ పరిపాలన శాఖకు ( జి ఏ డి ) స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మిని ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన శాఖ ( జి ఏ డి ) పరిధిలోని పాలనా సంస్కరణల విభాగం( జి పి ఎం & ఏ ఆర్) స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జూన్ 25, 2026న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఆమె ఈ నెల జూన్ 30న పదవీ విరమణ చేయబోతున్నారు. అంటే రిటైర్మెంట్‌కు సరిగ్గా నాలుగు రోజుల ముందే ప్రభుత్వం ఆమెకు ఈ పోస్టింగ్ ఇచ్చింది. వైకాపా ప్రభుత్వం మారిన తర్వాత (గత రెండేళ్లుగా) ఆమెకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచారు, చివరికి రిటైర్మెంట్ ముందు ఈ గౌరవప్రదమైన వీడ్కోలు పదవి దక్కింది.
కేసుల నేపథ్యం: ఆమెపై గతంలో ‘ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్’ (ఓఎంసీ) కేసులో అవినీతి ఆరోపణలు రావడం, సీబీఐ అరెస్ట్ చేయడం, జైలు జీవితం గడపడం వంటి వివాదాలు ఉన్నాయి. ఈ కేసుల అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉంది.
యర్రా శ్రీలక్ష్మి పశ్చిమగోదావరి జిల్లా లో ఉన్నత కుటుంబానికి చెందిన వారు. చిన్న వయసులోనే ఐఏఎస్ కు ఎంపికైన ప్రతిభావంతురాలు. సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. భారతదేశ ప్రతిష్టాత్మక అత్యంత ఉన్నత స్థానం అధిష్టించిన తొలి మహిళగా ఉజ్వల భవిష్యత్తు ఆమె సొంతం అవుతుందని అందరూ ఆశించారు. కేంద్ర ప్రభుత్వ సర్వీస్ లో క్యాబినెట్ సెక్రటరీగా ఆమె పదవి విరమణ చేయవలసి ఉంది. దురదృష్టవశాత్తు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవినీతి పాలనకు యర్రా శ్రీలక్ష్మి పావుగా మారింది. అవధులు మించిన అప్రతిహత అధికారాన్ని శ్రీలక్ష్మి వారి పాలనలో చెలాయించారు. తన ఉన్నతాధికారులు కూడా ఈమె ఆజ్ఞను పాటించే పరిస్థితి ఆనాడు ఉందని వార్తలు వచ్చాయి. ఓబులాపురం మైనింగ్ కేసులో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఈ పై కేసులు ఉన్నాయి. కుట్ర దారు గాలి జనార్ధన రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దోచుకుని బంగారు బాతు రూములు కట్టుకుని కులికాడు. వారి అవినీతి మత్తులో పడి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి, చదివిన అత్యున్నత చదువు ఎందుకు పనికి రాకుండా పోయి ముద్దాయిగా ప్రజల ముందు శ్రీలక్ష్మి నిలబడ్డారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలవడానికి చేసిన ప్రయత్నం తిరస్కరణకు గురైన అత్యంత దయనీయ, అవమానకర పరిస్థితిని కోట్లాదిమంది ప్రజలు బహిరంగంగా వీక్షించారు. ఆమె పడిన తీవ్ర మానసిక శోభ వల్ల తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. భర్త ఐపీఎస్ అధికారి. గౌరవప్రదమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి రాజకీయ విషవాలయంలో చిక్కుకొని, అవినీతి ఊబిలో కూరుకుపోయిన వ్యక్తి శ్రీలక్ష్మి. ఆమె సంపూర్ణ జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపవలసి ఉండగా, అవినీతి వల్ల ఆమె పదవి గండం ఏర్పడింది. ఈ పదవి మూన్నాళ్ళ ముచ్చట మాత్రమే. అది కూడా ప్రభుత్వం దయదలిచి పెట్టిన బిక్ష. ఈమె కాపు కులానికి చెందిన వారు కావటంతో కూటమి ఊరటనిచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఎవరెస్టు శిఖరం నుంచి అదఃపాతాళానికి జారిపోవటానికి అవినీతి ఎంత ప్రమాదకరమో సూచించే ఒక కేస్ స్టడీగా భారతదేశంలో శ్రీ లక్ష్మీ ఉద్యోగ జీవితం మిగిలిపోతుంది.
సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కి ఎట్టకేలకు పదవి. గౌరవప్రదంగా సాగనంపుతున్న కూటమి ప్రభుత్వం.
ఐఏఎస్ అధికారిణి యర్రా శ్రీలక్ష్మి