పాలకొలు, జూన్ 27: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరింఛుకుని శ్రీ ఏ.ఎస్.ఎన్.ఎం. ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాల, స్థానిక ఈగిల్ క్లబ్, రసాయన శాస్త్ర విభాగం, ఎన్.ఎస్.ఎస్. యూనిట్లు I,II ఎన్.సి.సి. సంయుక్త ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ టి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కే రజినీకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి, కుటుంబం మరియు సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అన్నారు.కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ టి కృష్ణ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, క్రీడలు మరియు సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు.
పి. చిట్టిబాబు, అధ్యక్షులు, పాలకొలు బార్ అసోసియేషన్, ఎం. రంగారావు, ప్యానెల్ అడ్వకేట్స్ కరుణాకర్, కె. సత్యనారాయణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడంలో పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని, యువత అపరిచితుల ప్రలోభాలకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కలిగి సమాజంలో ఇతరులకు కూడా చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో న్యాయ పోలీసు విభాగాలకు చెందిన సిబ్బంది, కోఆర్డినేటర్ కె. భద్రాచలం, రసాయన శాస్త్ర విభాగం ఇన్-చార్జ్ డా. వి. యామిని, ఈగిల్ క్లబ్ కన్వీనర్ ఎ. వంశీ, ఎన్.ఎస్.ఎస్. యూనిట్ కోఆర్డినేటర్లు డా. రామకృష్ణ, డా. వి. విజయలక్ష్మి, ఎన్.సి.సి. అధికారులు, కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి: సర్కిల్ ఇన్స్పెక్టర్ కే రజిని కుమార్.
మాదకద్రవ్యాల ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్న అధికారులు