పాలకొల్లు: జూన్, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్)
సాటివారి కష్టాన్ని ఏదో ఒక రూపం లో పంచుకోవడం ద్వారా సమాజం ఒక కుటుంబం గా మారుతుందని స్థానిక వాకర్స్ క్లబ్, అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు అన్నారు. పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం లో అర్చకునిగా పనిచేస్తున్న నిమ్మగడ్డ వెంకట నాగేంద్ర ప్రసాద్ కుమారుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. బెంగళూరు లో చికిత్స తీసుకోవలసి ఉంది. ఈ పరిస్థితిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసి, వాకర్స్ క్లబ్ తరపున సభ్యులు సమకూర్చిన 28 వేల రూపాయలు ఆ కుటుంబానికి అందించారు. కార్యక్రమంలో, క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, పూర్వ గవర్నర్ ఆకి రామకృష్ణ, ఉపాధ్యక్షులు మానెం బసవరాజు, ధనాని శ్రీరామమూర్తి, కఠారి నాగేంద్ర కుమార్, జవ్వాజి కల్యాణ్, కాపా చిరంజీవి, శ్రీనివాస శాస్త్రి, చామా శ్రీనివాసరావు,గుండుబోయిన నాగేశ్వరరావు,కర్రి కిరణ్,కోట చంటియ్య తదితరులు పాల్గొన్నారు.
వాకర్స్ క్లబ్ , రూ.28 వేల ఆర్థిక సాయం.
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తున్న వాకర్స్ క్లబ్ సభ్యులు