పాలకొల్లు: జూన్, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన వృత్తి జర్నలిజమని స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవలన శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక కిరాణం మర్చంట్ అసోసియేషన్ హాల్లో జరిగిన రెండు రోజుల పాత్రికేయుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజానికి స్ఫూర్తిని ఇవ్వడం కోసం, చైతన్య పరచడానికి జర్నలిస్టులు నీతిగా, నిజాయితీగా, నిస్వార్థంతో పనిచేస్తారని తన అనుభవం అని వెల్లడించారు. పి ఆర్ మీడియా, ఎస్ అకాడమీ ఆధ్వర్యంలో చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అధ్యక్షతన ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పాత్రికేయులకు మంత్రి ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐజేయు నాయకులు ద
దూసనపూడి సోమ సుందర్, మంగేష్ తదితరులు శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు పరిసర ప్రాంతాల పాత్రికేయులు పాల్గొన్నారు.
సమాజాన్ని చైతన్య పరిచేవారు జర్నలిస్టులు. -మంత్రి నిమ్మల.
పాత్రికేయులకు ధ్రువపత్రం అందజేస్తున్న మంత్రి నిమ్మల