అమరావతి: జూలై, 1( తెలుగు న్యూస్ పవర్. కామ్) సోషల్ మీడియా వికృతి చేష్టలకు చెక్ పెట్టడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇందులో సైబర్ నేరాలకు సంబంధించిన శాఖ, పోలీసులు, చట్టాన్ని అమలుపరిచే వివిధ శాఖలు ఉమ్మడిగా సోషల్ మీడియా వికృతి ధోరణులను ఎప్పటికప్పుడు తమ నిఘాతో కనిపెడతాయని చెప్పారు. వాటిపై వెంటనే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వ్యక్తిగత స్వేచ్ఛకు సంపూర్ణ రక్షణ కల్పిస్తుందన్నారు. అయితే వ్యక్తిగత స్వేచ్ఛ మరొకరి స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉండకూడదని హెచ్చరించారు. చట్టంలో వాక్ స్వాతంత్రానికి అపరిమిత అధికారాలు లేవని, ప్రభుత్వ పరిధిలోకి వచ్చే, మహిళలు, వ్యక్తులు, ప్రభుత్వాలపై కుట్రపూరిత ఉద్దేశంతో చేసే ఆధార రహిత అవమానకర ఆరోపణపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎందుకు అవసరమైతే రాష్ట్ర శాసనసభలో చట్టం కూడా తీసుకురావడానికి వెనకాడమన్నారు. భారత న్యాయ సంహిత లోని వివిధ సెక్షన్ల కింద శిక్షలు విధిస్తారని తెలిపారు. ప్రభుత్వాన్ని, పార్టీలను సద్విమర్శ చేస్తే స్వీకరిస్తామన్నారు.
సోషల్ మీడియా వికృతి చేష్టలకు చెక్ పెట్టనున్న కూటమి ప్రభుత్వం. -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
పత్రికా సమావేశంలో మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్