Telugu News Power

పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల పథకం- నీటిని విడుదల చేసిన మంత్రి నిమ్మల.

పట్టిసీమ ఎత్తిపోతల పథకం నీటి విడుదల సందర్భంగా పూజలు నిర్వహిస్తున్న మంత్రి నిమ్మల
ఎత్తిపోతల పథకం నీటి విడుదల సందర్భంగా మాట్లాడుతున్న మంత్రి నిమ్మల

తాళ్లపూడి : జూలై, 8( తెలుగు న్యూస్ పవర్. కామ్) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపుతో చేపట్టిన పట్టిసీమ తాళ్లపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు మన రామానాయుడు పూజలు చేసి, జల హారతి ఇచ్చి నీటిని బుధవారం విడుదల చేశారు. ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు చుక్క నీరు లేని పరిస్థితుల్లో కూడా ఈ పథకం ద్వారా కృష్ణాజిల్లాకు 450 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. నాడు 1300 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల ఇప్పటికీ 50 వేల కోట్ల రూపాయల సంపద సృష్టి జరిగినట్టు మంత్రి వెల్లడించారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వట్టి పోతల పథకంగా హ్యాపీ వర్ణించడానికి మంత్రి ఖండించారు. జల ధారా జలహారతి పథకం ద్వారా ప్రతి నీటి బుట్టలు ఓడిసిపట్టే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు. సూపర్ నిన్ను ద్వారా సంభవించే కుంభవృష్టి కి నీరు సముద్రంలోకి వృధాగా పోకుండా కాపాడతామని తెలిపారు. సూపర్ నిన్ను వల్ల తాగునీటికి సాగునీటికి సమస్య ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయని హెచ్చరించారు. సందర్భంగా రైతులు ఆరుతడి పంటలు ఏసి నీటి యాజమాన్య పద్ధతులు పాటించి వృధాను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ అభిషేక్, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు, బద్దిపాటి వెంకటరాజు, నీటి సంఘాల తరఫున ఆళ్ళ గోపాలకృష్ణ పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు