Telugu News Power

సాహితీవేత్త అప్పాజోష్యులకు రసధుని పురస్కారం.

పాలకొల్లు: జూలై, 19( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక రసధుని సాహిత్య సంస్థ, గత 32 ఏళ్లగా అందిస్తున్న పెద్దభోట్ల బ్రహ్మయ్య స్మారక పురస్కారానికి, ఈ ఏడాది ప్రముఖ సాహితీ వేత్త, విశ్రాంత ఆచార్యులు, అప్పాజోష్యుల సత్యనారాయణ ను ఎంపిక చేసింది. ఈ నెల 26న స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాలులో ఉదయం 10 గంటలకు ఈ పురస్కార కార్యక్రమం జరుగుతుందని అధ్యక్షులు కొట్టి భాస్కరరావు తెలిపారు. ఈ పత్రిక సమావేశంలో కార్యదర్శి వెంకటరత్నం, కోశాధికారి, ముచ్చర్ల వెంకట సత్యనారాయణ, బొండాడ శ్రీకృష్ణమూర్తి, చెప్పాడు బాబు మూర్తి తదితరులు పాల్గొన్నారు.