Telugu News Power

జపాన్ ఓపెన్ సూపర్ 750 విజేతగా చరిత్ర సృష్టించిన పీవీ సింధు. పవన్ కళ్యాణ్ అభినందనలు.జపాన్ ఓపెన్ సూపర్ 750 విజేతగా చరిత్ర సృష్టించిన పీవీ సింధు. పవన్ కళ్యాణ్ అభినందనలు.

విదేశీ గడ్డపై పతకం సాధించిన తొలి షట్లర్ పీవీ సింధు

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో అద్భుత విజయం సాధించి, చరిత్ర సృష్టించింది. జపాన్‌కు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణి అకానే యమగుచిని, ఆమె సొంతగడ్డపై ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఈ విజయంతో జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్‌ను గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా పీవీ సింధు నిలిచింది. ఈ ఘనతపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకం వ్యక్తమవుతోంది.
ఈ సందర్భంగా, ప్రధాని మోడీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, హోం మంత్రి అమిత్ షా, కేంద్ర క్రీడా శాఖ మాత్యులు మన్ సుక్ మాండవ్య, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చేసాక మాచిరి లోకేష్,పీవీ సింధుకు అభినందనలు తెలిపారు. ఆమె ఆటలో చూపిన ధైర్యం, పట్టుదల, పోరాట స్ఫూర్తి భారత ఛాంపియన్‌కు నిదర్శనమని కొనియాడారు.
“సవాళ్లను అధిగమించి మళ్లీ అత్యున్నత స్థాయికి చేరుకోవడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది. జపాన్‌లో ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా దేశానికి గర్వకారణంగా నిలిచారు. మీ ప్రయాణం లక్షలాది మంది యువ క్రీడాకారులకు పెద్ద కలలు కనాలని, కష్టపడి సాధించాలని, ఎన్నడూ వెనుకడుగు వేయకూడదని స్ఫూర్తినిస్తుంది” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
భారత త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ వేదికపై మరింత ఎత్తుకు తీసుకెళ్లేలా భవిష్యత్తులోనూ ఇలాంటి చారిత్రాత్మక విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. దేశమంతా ఈ విజయాన్ని సంబరంగా జరుపుకుంటోందని, పీవీ సింధు భవిష్యత్ ప్రయాణం విజయవంతంగా కొనసాగాలని శుభాకాంక్షలు తెలియజేశారు.