Telugu News Power

మంత్రిని కలిసిన ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ.

మంత్రి నిమ్మలకు వినతి పత్రం అందజేస్తున్న జేఏసీ నాయకులు

పాలకొల్లు: జూలై,20( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడుకు జేఏసీ అధ్యక్షులు యూత్ పాండురంగారావు ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. పి ఆర్ సి కమిటీ ఏర్పాటు చేయడంలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని, వెంటనే పిఆర్సి కమిటీ వేసి అయ్యారు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఐదు డిఏలు, గత పిఆర్సి బకాయిలు దక్షిణం విడుదల చేయించాలని కోరారు. నువ్వుల ప్రావిడెంట్ ఫండ్, ఎర్న్ లీవ్ నుంచి నిధులు మంజూరుకు అవకాశం కల్పించాలని కోరారు. హెల్త్ కార్డులు ఆసుపత్రుల్లో ఆమోదించేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓ పి ఎస్ అమలు చేయాలని, విశ్రాంత ఉద్యోగులు పెన్షన్ అమలు చేయాలని కోరారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, విజయ రామరాజు, పోలిశెట్టి క్రాంతి కుమార్, ఎస్ టి యు అధ్యక్షులు పెనుమత్స సాయి వర్మ, ప్రకాశం, రాజశేఖర్ ఏసుబాబు, రమణ,కామరాజు, రమేష్ రెడ్డి, గుబ్బల ప్రసాద్ తదితర వివిధ సంఘాలకు చెందిన నాయకులు మంత్రిని కలిసిన బృందంలో ఉన్నారు.