Telugu News Power

ముద్రగడ కు నివాళులర్పించిన యలమంచిలి వైసీపీ నేతలు.

ముద్రగడకు నివాళులు అర్పిస్తున్న వైసీపీ నాయకులు

కిర్లంపూడి: జూలై, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, ఎంపీ ముద్రగడ పద్మనాభం సమాధి వద్ద బుధవారం, పశ్చిమగోదావరి జిల్లా, యలమంచిలి మండల వైసీపీ నాయకులు నివాళులు అర్పించారు. ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ పార్టీ ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబును కలసి తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని కోరారు. ఈ పర్యటనలో ఎలమంచిలి మండల అధ్యక్షులు వినుకొండ ధనలక్ష్మి రవికుమార్, మండల వైసీపీ అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు, వీర ఉమా నాయుడు, పెంటపాటి నూకరాజు, పెచ్చెట్టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.