పాలకొల్లు: ఆగస్టు, 6( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల(స్వయంప్రతిపత్తి) లో డిగ్రీ కోర్సులలో ఆన్ లైన్ లో ప్రవేశాలు
ప్రారంభమైనట్లు
ప్రిన్సిపాల్ డా కె రత్న మాణిక్యం గురువారం వెల్లడించారు.ఈ సందర్భంగా అడ్మిషన్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఇంటర్ పూర్తిచేసుకున్న విద్యార్ధులు ప్రభుత్వ కళాశాలలో చేరితే ప్రభుత్వం నుంచి అందే వివిధ పథకాలతో పాటు,కళాశాలలో అందిస్తున్న కోర్సుల వివరాలు ,దూర ప్రాంత విద్యార్ధులకు ప్రభుత్వంచే నడపబడుతున్న హాస్టల్ సౌకర్యాలగూర్చి వివరించారు.అద్దేపల్లి సత్యనారాయణమూర్తి కళాశాల స్వయంప్రతిపత్తి కలిగి నోడల్ సెంటర్ గా జాబ్ మేళా ద్వారా క్యాంపస్ సెలక్షన్ లు జరపుతున్నామని,కళాశాల లో విశాలమైన ప్రాంగణం ఉండి,ఆటస్థలాలు,సొంత ప్రయోగశాలలు, డిజిటల్ క్లాసురూమ్స్ లతో పాటు
విద్యార్ధునులకు టైలరింగ్ శిక్షణ, మగ్గం వర్క్ ,ఎంబ్రాయిడరీ వర్క్ లో శిక్షణ ,శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ఉచితంగా కుట్టుమిషన్ ల పంపిణీ, విద్యార్ధులకు ఏ సి మోకానిజంలో శిక్షణ,స్నానం చేసే సబ్బుల తయారీలో శిక్షణ,సేంద్రీయ ముడి పదార్ధాలను ఉపయోగించి చాక్లెట్ ల తయారీలో శిక్షణ వంటివి ఏర్పాటు చేసినట్లు తెల్పారు.ప్రభుత్వ కళాశాలలో ఫీజులు చాలా తక్కువని ,నిష్ణాతులైన అధ్యాపకుల బృందంతో నిరంతర సిసి కెమోరాల పర్యవేక్షణలో కళాశాల నడుస్తుంతుందని, సింగల్ మేజర్ కోర్సులతో బి యస్సీ (మ్యాథ్స్ /కంప్యూటర్ సైన్స్ /కెమిస్ట్రీ/ఫిజిక్స్ /బోటనీ/జువాలజీ/స్టాటటిక్స్ ) ,బికాం (జనరల్ ),బికాం కంప్యూటర్స్ అప్లికేషన్ ,బి ఏ (ఏకనామిక్స్ /పొలిటికల్ సైన్స్ /హిస్టరీ) లతో పాటు యం ఏ ఏకనామిక్స్ , యంకాం,యం యస్సీ (అక్వాకల్చర్) ,యం యస్సీ (అర్గానిక్ కెమిస్ట్రీ),యం యస్సీ (బోటనీ)వంటి పి జి కోర్సులు నిర్వహించబడుతున్నాయని ఆసక్తి గల విద్యార్ధులు నేరుగా కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా అడ్మిషన్ లు పొందవచ్చని ప్రిన్సిపాల్ డా కె రత్నమాణిక్యం తెలిపారు. ఈ కార్యక్రమం లో వైస్ ప్రిన్సిపాల్ టి శ్రీకృష్ఞ,ఐక్యూఏసి కో ఆర్డినేటర్ డా బూసి వెంకటస్వామి ,అకడమిక్ కో ఆర్డినేటర్ జి సుమలత ,
జూవాలజీ శాఖాధిపతి డా యం రామకృష్ణ ,ఆంగ్ల విభాగాధిపతి కె శామ్యూల్ ,అడ్మిషన్ కోఆర్డినేటర్ పి శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ కనకలక్ష్మి తదితర అధ్యాపక,అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీ ఏ యస్ యన్ యం ప్రభుత్వ కళాశాల లో డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం.