విజయవాడ: ఆగస్టు6( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం నిర్వహించిన ఆయుష్ శిక్షణ కార్యక్రమం –2026లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఆయుష్ మినిరల్స్, మెటీరియల్స్ ఎక్సపో, హెర్బల్ ఎక్సపోప్రదర్శనలను, వివిధ ఔషధ మొక్కలు, ఆయుష్ ఉత్పత్తుల స్టాల్స్‌ను పరిశీలించారు.రాష్ట్రంలో గత రెండేళ్లలోనే నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా రూ.426 కోట్ల నిధులు సాధించి, 4 కొత్త ఆయుష్ మెడికల్ కాలేజీలు, 6 ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులు, 150 ఆయుష్ డిస్పెన్సరీల అభివృద్ధి, 126 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ఏర్పాటుకు కృషి చేసినట్టు తెలిపారు..
గుంటూరు జిల్లా నడింపాలెంలో రూ.100 కోట్లతో కేంద్ర యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ (సీఆర్ఐవైఎన్) మంజూరు అయిందని వెల్లడించారు. తిరుపతిలో సుమారు రూ.1,000 కోట్ల వ్యయంతో ఎయిమ్స్ తరహాలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ ఆయుర్వేద (ఏ ఐ ఐ ఏ ) ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి నట్టు తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక సంస్థను రాష్ట్రానికి తీసుకురావడానికి అన్ని విధాలా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు
రాష్ట్రానికి రూ. 1,000 కోట్లతో పకృతి ఆసుపత్రి. -ఆరోగ్య శాఖామాత్యులు ఎస్. కే. యాదవ్ వెల్లడి.