పాలకొల్లు: ఆగస్టు,9( తెలుగు న్యూస్ పవర్. కామ్)
బిజెపి సీనియర్ నాయకులు, పోడూరు మండలం ఇన్చార్జి, సెంట్రల్ రైల్వే డి ఆర్ యు సి సి మెంబర్ జక్కంపూడి కుమార్ ప్రోత్సాహముతో ఉభయ గోదావరి జిల్లాల గోవింద మాల కళ్యాణోత్సవ కమిటీ, పాలకొల్లు వారి ఆధ్వర్యంలో వేసవి కాలంలో రైల్వే ప్రయాణీకుల దాహార్తిని తీర్చేందుకు పాలకొల్లు రైల్వే స్టేషన్ లో ఏప్రిల్ 8 న ప్రారంభించిన చలివేంద్రం ఆగస్టు 9 ఆదివారం నాటికి 4 నెలలు దిగ్విజయముగా పూర్తియ్యింది. ఈ శుభ సందర్భముగా, పాలకొల్లు రైల్వే స్టేషన్ లో ఆదివారం ఉదయం ఏర్పాటుచేసిన ముగింపు సభలో కుమార్ మాట్లాడుతూ, దేశంలోనే ఎక్కడా లేని విధంగా గత మూడు సంవత్సరములుగా చలివేంద్రాన్ని విజయవంతముగా నడిపించిన స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా 4 నెలలు నడపడానికి కారకులైన గోవింద మాల కమిటీ వారికి, రైల్వే స్టేషన్ మాస్టర్ కి, రైల్వే సిబ్బందికి, దాతలకు, బిజెపి పాలకొల్లు పట్టణ శాఖ వారికి, ముగింపు సభకు విచ్చేసిన ప్రోత్సాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ మాస్టారు, సత్యం గురుస్వామి, బీరక ప్రసాద్, కొల్లి కొండా ప్రసాద్, శీరం ఆనందకృష్ణ, మల్లవోలు సురేష్, చెరుకూరి శ్రీనివాసరావు, సత్యజిత్ కుమార్, బెల్లంకొండ శ్రీరామ్, జగపతి రాజు, దుడే హరనాథ్, ఇనుకొండ శేషాద్రి, అవెన్ జైను, నాలం బాబి, ఇస్సాకు నాగలక్ష్మి, బైల ఆదిత్య, పోలిశెట్టి నాగేశ్వరరావు, వాకా శ్రీనివాసరావు, కోలా నరసింహారావు, వీరా రామకృష్ణ, కోటిపల్లి దుర్గారావు, గోవింద మాల కమిటీ సభ్యులు, తదితరులు హాజరయ్యారు..
జక్కంపూడి కృషితో ప్రజల దాహార్తి తీర్చిన చలివేంద్రం ముగింపు.
స్థానిక రైల్వే స్టేషన్ లో చలివేంద్రం ముగింపు కార్యక్రమం