కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
బ్రాడీపేట బైపాస్ రోడ్ లో భారీ ఏర్పాట్లు.
మంత్రి నిమ్మల స్వీయ పర్యవేక్షణ.
కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఉభయగోదావరి జిల్లాల ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు రాక.
పాలకొల్లు: ఆగస్టు,10( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బ్రాడీపేట బైపాస్ రోడ్ లో మంగళవారం ఆక్వా రైతు సంఘాల ఆధ్వర్యంలో మహాసభ నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ పై యూనిట్ ధర రూ. 1.50 ల కు అందరికీ వర్తింపజేయటంతో రైతులు, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతా పూర్వకంగా భారీ బహిరంగ సభ తలపెట్టారు. గత జగన్ ప్రభుత్వం ఆక్వాజోన్, నాన్ – ఆక్వజోన్ గా విభజించి సబ్సిడీ ఇవ్వటం వల్ల రైతులు నష్టపోయారని సంఘాలు ఆరోపించాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏ విధమైన అడ్డంకులు లేకుండా ఆ కో రైతులు అందరికీ విద్యుత్ సబ్సిడీ వచ్చేలా ఇటీవల జీవో విడుదల చేసింది. ఈ విద్యుత్ సబ్సిడీ కోసం ఎన్నో ఏళ్లుగా రైతులు ఉద్యమాలు చేస్తున్నారు. రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పలుసార్లు ప్రభుత్వం సంబంధిత మంత్రులతో సంప్రదింపులు జరిపి జీవో సాధించకు వచ్చారు. స్థానిక శాసనసభ్యులు,రాష్ట్ర జలవరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఈ జీవో విడుదల విషయంలో ముఖ్యమంత్రిని, మంత్రులను, అధికారులను ఒప్పించి జీవో విడుదల చేయించారని రైతు సంఘం నాయకులు తెలిపారు. ఈ సంతోష సమయంలో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపటానికి ఆక్వా రైతులు నిర్ణయించారు. కేంద్ర మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర వ్యవసాయ, మత్య శాఖ, పశుసంవర్ధక శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెం నాయుడు, ఆ విద్యుత్ శాఖ మాత్యులు, జిల్లా ఇన్చార్జి మంత్రి, గొట్టిపాటి రవికుమార్ ఈ సభకు హాజరవుతున్నారు. సోమవారం రాత్రికి 17 మంది ఎమ్మెల్యేలు వస్తున్నట్టు మంత్రి నిమ్మల రామానాయుడు కు సమాచారం ఇచ్చారు. ఇంకా పొదుగురు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు ఈ సభకు హాజరవుతున్నారు. ఈ భారీ సభకు సంబంధించి మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, బూన్ రాజు, పట్టణ టిడిపి అధ్యక్షులు,గండేటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి, పెచ్చెట్టి బాబు, నీటి సంఘం అధ్యక్షులు ఆరమిల్లి చిన్ని, స్థానిక రైతు సంఘం అధ్యక్ష,కార్యదర్శులు, బోనం చినబాబు, పెనుమత్స సత్యనారాయణ రాజు, మేడిది జాన్ రాజు, పలువురు ఆక్వా రైతులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ భారీసభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా, కూటమి ప్రభుత్వానికి ఆక్వా రైతుల నుంచి ఈ గౌరవం దక్కడం విశేషం.
