Skip to main content

Telugu News Power

ఛాంబర్స్ కళాశాలలో ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

ఛాంబర్స్ కళాశాలలో పతాకావిష్కరణ
విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ కార్యక్రమం

పాలకొల్లు: ఆగస్టు,15( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఛాంబర్స్ కళాశాలల ఆధ్వర్యంలో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా శనివారం నిర్వహించారు. కళాశాల చైర్మన్ కె.వి నరసింహారావు, కళాశాల సెక్రటరీ కే సీతారామరాజు, జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలు వేసి, జండా ఆవిష్కరణ చేశారు. ఎన్ . సి.సి నావెల్ విద్యార్థులు త్రివర్ణ పతాకానికి మార్చ్ ఫాస్ట్ వందనం చేశారు.
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు మాట్లాడుతూ, 1947 నాటి పరిస్థితులకు 2026 నేటి పరిస్థితులకు భారతదేశంలో సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా గణనీయమైన మార్పులు వచ్చి దేశాభివృద్ధి జరుగుతున్నదన్నారు.
కళాశాల సెక్రెటరీ కేవీ సీతారామరాజు మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన దేశాల సరసన మన దేశం నిలబడడానికి చాలా దగ్గర సమయం ఉన్నదని, చక్కని పాడి పంటలతో పారిశ్రామిక విద్యా వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో దేశ యువత ప్రపంచ దేశాలతో పోటీపడి మరీ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని, దేశ సర్వతోముఖా భివృద్ధికి యువత బాధ్యతను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి. వెంకటేశ్వరావు మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుల త్యాగనిరతిని నేటి యువత గుర్తు చేసుకుంటూ దేశ పునర్నిర్మాణానికి అంకితం అవ్వాల్సిన అవసరం ఉన్నదని, దేశ సమైక్యత స్ఫూర్తిని, రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ దేశాభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు.
కళాశాలలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, దేశభక్తి పాటల పోటీలు, వ్యాసరచన పోటీలలో ప్రధమ తృతీయ బహుమతులు సాధించిన విద్యార్థులకు అదేవిధంగా మార్చ్ ఫాస్ట్ నిర్వహించిన ఎన్సిసి విద్యార్థులకు సర్టిఫికెట్స్,మెడల్స్ కళాశాల యాజమాన్య సభ్యులు బహుకరించారు ఈ కార్యక్రమానికి తటవర్తి కృష్ణమూర్తి, కళాశాల ట్రెజరర్ ప్రవీణుబాను, కళాశాల అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ ఏవీఎస్ మూర్తి, ఎన్ .సీతారామరావు, అడబాల రమణ, కటారి నాగేంద్ర కుమార్, చాంబర్స్ డోనర్స్ కంచర్ల వీర్రాజు గారి కుటుంబం, చాంబర్స్ సెక్రటరీ కె. నాగేంద్రబాబు ఛాంబర్స్ ట్రెజరర్ మామిడి బాబు, డాక్టర్ వర్మ , ఇతర గవరన్నింగ్ బాడీ మెంబర్స్, తల్లిదండ్రులు, అధ్యాపకులు, రవికుమార్ యు జానకి రామయ్య బి విజయలక్ష్మి రాంబాబు రాజమాధవి ఎన్సిసి కేర్ టేకర్ సంతోష్ ప్రసాద్ తదితరులు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.