Skip to main content

Telugu News Power

వైభవోపేతంగా బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం. సినీ, రాజకీయ ప్రముఖుల ఆగమన ఆనంద కోలాహాలం.

వధూవరు లను ఆశీర్వదిస్తున్న ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కన్యాదాత గణేష్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతులు

హైదరాబాద్:ఆగస్టు,16( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం, విశాఖపట్నకు చెందిన పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నడిపూడి వాసి, ప్రముఖ రియల్టర్, చిలుకూరి శ్రీనివాస్ జేష్ట కుమారుడు సూర్య తేజతో ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. జేఆర్సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
సంప్రదాయ వివాహ వేడుకల మధ్య జనని–సూర్య తేజ ఒక్కటయ్యారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జునతో పాటు నిర్మాత అల్లు అరవింద్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సతీమణి అన్నాకొణిదల, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, రాఘవేంద్రరావు, పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. దర్శకులు, నటీనటులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కన్వెన్షన్‌ సెంటర్ సందడిగా మారింది.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా వివాహ వేడుకకు హాజరై దంపతులను ఆశీర్వదించినట్లు సమాచారం.కుమార్తె వివాహాన్ని బండ్ల గణేష్ అత్యంత వైభవంగా నిర్వహించారు. సినీ పరిశ్రమలో తనకు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు తరలిరావడంతో జనని వివాహం టాలీవుడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టాక్ ఆఫ్ ది స్టేట్ గా వివాహ వేడుకపై చర్చించుకున్నారు. ముఖ్యంగా మహిళలు టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించారు.
జనని–సూర్య తేజ దంపతులకు తెలుగు న్యూస్ పవర్ తరఫున హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు.

తల్లిదండ్రులు శ్రీనివాస్, నీలిమ తో వరుడు తేజ