Skip to main content

Telugu News Power

గౌరవ వేతనం కోసం వినతి. -ఎంపీపీ ధనలక్ష్మి ఆధ్వర్యంలోఎమ్మెల్సీ రవీంద్రనాధ్ తో భేటీ.

ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ కు వినతి పత్రం సమర్పిస్తున్న ఎంపీటీసీలు

యలమంచిలి:ఆగస్టు,16
(తెలుగు న్యూస్ పవర్. కామ్) గత రెండున్నర ఏళ్లుగా నిలిచిపోయిన ఎంపీటీసీల గౌరవ వేతనం మంజూరుకు కృషి చేయవలసిందిగా,స్థానిక మండల పరిషత్ అధ్యక్షులు ఇనుకొండ. ధనలక్ష్మిగారు, ఉపాధ్యక్షులు,గొల్లపల్లి శ్రీనివాసరావు, ఆధ్వర్యంలో ఎంపీటీసీల బృందం ఆదివారం శాసనమండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. శాసనమండలిలో ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి మండలి సభ్యులతో మద్దతు కూడగట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ ఈ సందర్భంగా స్పందిస్తూ, శాసనమండలిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పర్యటనలో కొప్పాడి శ్రీనుబాబు,మాజీ ఎంపిపి, రావూరివెంకటరమణ, ఇసుకపల్లి శ్రీధర్ వర్మ, నల్లి సంధ్యారాణి,కంబాల సత్యశ్రీ,
మానుకొండ చిట్టెమ్మ , కడలి. సునీత, మండల పార్టీ కన్వీనర్ ఉచ్చుల. స్టాలిన్ బాబు, ఇనుకొండ. రవికుమార్ బృందం పాల్గొన్నారు.