Skip to main content

Telugu News Power

అమర జవాన్ కు పక్కా ఇల్లు బహూకరణ. ఇది కదా నిజమైన జెన్-జీ

స్థానిక యువత నిర్మించి ఇచ్చిన పక్కా ఇల్లు
బిఎస్ఎఫ్ జవాన్ ప్రతాప్ సింగ్ పాత ఇల్లు

ఇండోర్: ఆగస్టు,19( తెలుగు న్యూస్ పవర్. కామ్) మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జెన్- జెడ్ ఓ ఆదర్శనీయమైన సహాయాన్ని అందించి అందరి మన్ననలు అందుకుంటుంది. మాటలతో కాకుండా చేతలతో తమ లక్ష్యాన్ని ఏమిటో చేసి చూపింది.ప్రతాప్ సింగ్, భారత సరిహద్దు భద్రతా దళంలో పనిచేసే వారు. దేశ సేవలో 27 ఏళ్ల పాటు తరించి, పాకిస్తాన్ దుర్మార్గంగా జరిపిన కాల్పుల్లో ప్రాణత్యాగం చేశారు. ఆ అమరజీవి కుటుంబం దుర్భరమైన పరిస్థితుల్లో, కూలిపోతున్న ఇంటిలో ఉంటున్న విషయాన్ని గమనించిన అక్కడి యువత, ఆ జవాను కుటుంబానికి గట్టి మేలు చేయాలని తలపెట్టింది. అనుకున్నదే తడవుగా ఇంటి నిర్మాణాన్ని కూడా ప్రారంభించింది. సరిగ్గా మూడు నెలల్లో రూ.11 లక్షలతో అందమైన ఓ పక్క ఇల్లు నిర్మించి సింగ్ కుటుంబానికి అంకితం చేశారు. జెన్-జెడ్ కేవలం తమ హక్కుల కోసం మాత్రమే పోరాటం కాకుండా, దేశభక్తి, సేవా తత్వం కూడా తమ సొంతమని నిరూపించింది ఈ సంఘటన. వీరు చేసిన ఆదర్శనీయమైన అద్భుత సేవకు అసంఖ్యాకులైన ప్రజలు జేజేలు పలుకుతున్నారు.