
జనరల్ డెస్క్: ఆగస్టు,22( తెలుగు న్యూస్ పవర్. కామ్)
మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి, మహాదాత చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, ఉభయ తెలుగు రాష్ట్రాలు, దేశ,విదేశాల్లో ఉన్న మెగా అభిమానులు చిరంజీవి 71 వ జన్మదిన ఘనంగా జరిపారు.
కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా చిరంజీవి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి పాలాభిషేకాలు, రక్తదాన శిబిరాలు, అన్నదాన వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు స్వామి నాయుడు ఈ పుట్టినరోజు వేడుకలను సమన్వయం చేశారు.పాలకొల్లు పట్టణ చిరు పవన్ యువత ఆధ్వర్యంలో పూలపల్లిలో సి ఎల్ ఎన్
ఆర్,ఎల్ ఎన్ ట్రస్ట్ ఆశ్రమంలోవృద్ధుల మధ్య చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.ఆచంట చరణ్ దీపు, అల్లపల్లి చందు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిధి గా రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి తులా రామలింగేశ్వరరావు, పట్టణ జనసేన అధ్యక్షులు శిడగం సురేంద్ర హాజరయ్యారు. కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆశ్రమంలోని 40, ఇతరులు 35 మందికి భోజనాలు ఏర్పాటు చేసారు. తులా రామలింగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు చలన చిత్రంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకుని సరికొత్త వరవడిని సృష్టించి, దశాబ్దాల కాలంగా మెగాస్టార్గా వెలుగొందుతూ చిరంజీవి రక్త నిధి, నేత్ర నిధి స్థాపించి ఎన్నో లక్షల మందికి రక్తదానం చేసి ప్రాణం నిలిపిన చిరంజీవి దేశంలో, రాష్ట్రంలో ఎన్నో విపత్తులు సంభవించిన ప్రతి సందర్భంలోనూ తనవంతుగా లక్షల, కోట్ల రూపాయలను సహాయం చేసిన గొప్ప వ్యక్తి మెగాస్టార్ అని కొనియాడారు. పెద్ద విపత్తు కరోనా సమయంలో ఆక్సిజన్ అందక ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న సందర్భంలో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఎందరికో ఆక్సిజన్ పంపిణీ చేసి ప్రాణదాణం చేసిన గొప్ప వ్యక్తి చిరంజీవని పేర్కొన్నారు. చిన్నతనం నుంచే ఆయన్ని మేము ఆదర్శంగా తీసుకుని పాలకొల్లులో 28 బ్లడ్ క్యాంపులు నిర్వహించడమే కాకుండా ఎన్నో వేల మందికి రక్తదానం చేసామంటే చిరంజీవి ఇచ్చిన స్ఫూర్తి కారణమని, వారు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని అభిమానులు ఆకాంక్షించారు. పేదలకు చీరలు పంపిణీ చేశారు.
వృద్ధాశ్రమం వారు భోజనాలు ఏర్పాటు చేసినందుకు సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కురెళ్ల సాయి, కొమ్ములు దినేష్, చేబ్రోలు కృష్ణమోహన్, అలుగు సత్తిబాబు,కోట్ల నవీన్, వలవల ఆనంద్,సాంబ,మునకాల అఖిల్, విశాఖ కిషోర్,మద్దాల గణేష్,గొలగాని బాబీ,తదితరులు పాల్గొన్నారు.



