
పాలకొల్లు:ఆగస్టు,23(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్మశానవాటికలను కైలాసగిరిలుగా సుందరీకరించే ప్రణాళికలో భాగంగా, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఆదివారం తిల్లపూడిలో శ్రమదానం చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ
(సి ఎస్ ఆర్) నిధుల నుంచి మెగా ఇంజనీరింగ్ సంస్థ ఇందుకు రూ. 50 లక్షలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా మంత్రి, గ్రామస్తుల్లో స్ఫూర్తి నింపి, మహిళలు కూడా ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించారు. మంత్రి పారకొట్టి, చెట్లు కోసి, ట్రాక్టర్ నడిపి శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా, గ్రామస్తులు, విద్యార్థులు మంత్రి నిమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు. శివదేవునిచిక్కాల నుంచి తిల్లపూడి వరకు రూ. 6 కోట్లతో నిర్మించిన సిమెంట్ రోడ్డు, విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ కార్యక్రమాల పట్ల వారు మంత్రి వద్ద సంతోషం వ్యక్తం చేశారు.ఈ అభివృద్ధి తాము కలలో కూడా ఊహించలేదని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ, గొడ్డలి పార్టీ రప్ప రఫా నినాదంతో జనాల్ని భయపెడుతుంటే, కూటమి ప్రభుత్వం అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మేలు చేయడంలో ముందుకు దూసుకుపోతుందన్నారు.
సురక్షిత తాగునీరు ఆరోగ్యానికి వరం.
అదే కూటమి లక్ష్యం.
ఇదే గ్రామంలో 55 లక్షలతో నిర్మిస్తున్న మంచినీటి పథకం పనులను మంత్రి ప్రారంభించారు. సూక్ష్మ వడపోత దిన్నె ( మైక్రో ఫిల్టర్ బెడ్), ప్రధాన నీటి సరఫరా పైపులైను కు శ్రీకారం చుట్టారు. మహిళలకు బిందెలతో మంచినీరు అందించారు. ఈ సందర్భంగా, మామూలు నీటికి, రక్షిత మంచినీటి పథకం ద్వారా శుద్ధి చేసిన తాగునీటికి స్వచ్ఛతలో ఉన్న తేడాను గ్రామస్తులకు మంత్రి స్వయంగా గ్లాసుల్లో నీరు పట్టి చూపించారు. నూటికి 70 శాతం త్రాగునీటి వల్ల వచ్చే వ్యాధులనుంచి రక్షించడానికి,రాష్ట్ర ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించి, వారి ఆరోగ్యాన్ని కాపాడాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
టిడిపి తీర్థం పుచ్చుకున్న వైసీపీ నాయకులు.
స్థానిక నడపన సుబ్బారావు, కూనపురెడ్డి నాగేశ్వరరావు, తదితరులు కూటమి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పధకాల పట్ల ఆకర్షితులై, వైసిపి పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. మంత్రి నిమ్మల రామానాయుడు వారికి పార్టీ కండువాలు కప్పిh ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, పాముల రజిని కుమార్, కామిశెట్టి రంగారావు, అయ్యప్ప నాయుడు, నీలం తాతాజీ, ఇంటి శ్రీరాముడు, వెంగళరావు నడపన జగపతిరావు, నరసింహ స్వామి, బాబ్జి,బల్ల వాసు, గురుజు రాజబాబు, తాసిల్దార్, ఎడ్ల దుర్గా కిషోర్, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, ఎంఈఓ, ప్రత్యేక అధికారి గుమ్మళ్ళ వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.