Skip to main content

Telugu News Power

ఛాంబర్స్ కళాశాలలో ఎన్ సి సి విద్యార్థుల ఎంపిక.

ఎన్ సి సి అధికారులను సత్కరిస్తున్న ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు

పాలకొల్లు: సెప్టెంబర్,29( తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక బిఆర్ఆర్ అండ్ జీకేఆర్ చాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్సిసి నావెల్ యూనిట్ కొరకు నూతన విద్యార్థులు ఎంపిక కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ఎన్సిసి 7ఏ నావెల్ యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ శ్రేయ దీక్షిత్ ఎంపికకు విచ్చేసిన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు ఎన్సిసిలో చేరడం ద్వారా మంచి వ్యక్తిత్వం, క్రమశిక్షణతో కూడిన జీవితం, దేశానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదగవచ్చునన్నారు. భారత ప్రభుత్వం దేశ రక్షణ దళాల్లో ఉద్యోగాలు ఎంపికలు ఎన్సీసీ ‘సి ‘ సర్టిఫికెట్ ఉన్నవారికి తగు ప్రాధాన్యతను ఉంటుందన్నారు.
కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు మాట్లాడుతూ, దేశంలో సామాజిక సమస్యలకు స్పందించే విధంగా ఎన్ఎస్ఎస్, భవిష్యత్తు దేశ బ్రతుకు ఎన్సిసి లాంటివి విద్యార్థులకు అలవాటు చేయటమే విద్యలో ఒక భాగంగా ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ లను భారత ప్రభుత్వం ఉంచినదని తమ కళాశాలలో అటు ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కళాశాల పలు కార్యక్రమాలలో పాల్గొని అత్యుత్తమ విలువలు కలిగిన పౌరులుగా తయారవుట తమకు ఎంతో సంతోషం గా ఉందన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఎన్సిసి క్యాడేట్స్ కు సమాజంలో మంచి గుర్తింపునిస్తుందని, కష్టపడే లక్ష్యసాధనకు, ఆత్మ స్థైర్యాన్ని పెంపొందిస్తుంది అన్నారు. విద్యార్థులకు రాత పరీక్ష, దేహదారుడ్యా, మౌఖిక పరీక్షలు నిర్వహించారు. ఈ ఎంపిక కార్యక్రమాన్ని ఎన్సిసి నావల్ యూనిట్ అధికారులు కుమావత్, రమేష్, ముఖేష్, మోహిత్, కళాశాల ఎన్సిసి సీటిఓ కె.సంతోష్ ప్రసాద్ మరియు సీనియర్ ఎన్సిసి క్యాడెట్ల ఆధ్వర్యంలో జరిగింది.