
యలమంచిలి:అక్టోబర్,9
(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామి వారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఈనెల 11 నుంచి 20 వరకు పది రోజులపాటు నిర్విఘ్నంగా కొనసాగుతాయని, ఆలయ కార్య నిర్వహణ అధికారి, ఎం సతీష్ కుమార్, ధర్మకర్తల మండలి అధ్యక్షులు చిలుకూరి ఆంజనేయులు శుక్రవారం తెలిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు పూజా సామాగ్రి ఆలయ అర్చకులు వాడపల్లి గోపికి అందజేయవలసిందిగా కోరారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు పూజా కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు విరివిగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.