Telugu News Power

Telugu News Power

పాలకొల్లు దుఃఖదాయని దమ్మయపర్తి మురుగు నుంచి విముక్తి.

పాలకొల్లు:డిసెంబర్,8 (తెలుగు న్యూస్ పవర్) దమ్మయ్యపర్తి కోడు పాలకొల్లు మునిసిపాలిటీ అంత పురాతనమైనది. హిందూపురాణాలలో, ముఖ్యంగా,గరుడ పురాణంలో చెప్పబడిన వైతరణీ నది లాంటిది. ఆ నది యమలోకానికి,భూమి మరియు నరకం మధ్య ప్రవహించే భయంకరమైన నదిగా చెప్పబడింది. పాపులు చనిపోయిన తర్వాత ఈ నదిని దాటవలసి వస్తుంది. ఇక్కడ రక్తం, మలం, కుళ్ళు, మూత్రం వంటి దుర్గంద ద్రవాలతో నిండి ఉంటుంది. పాపులను ముళ్ళు,చేపలతో బాధపెడుతూ ఈ నదిని దాటిస్తారు అని నమ్మకం. అయితే దమ్మయ్యపర్తికోడు వైతరణి…

Read More

క్షీరా రామలింగేశ్వర ఆలయంలో విఘ్నేశ్వర పూజ.

పాలకొల్లు డిసెంబర్ 9 తెలుగు న్యూస్ పవర్ వారం వారం జరుగుతున్న సప్త మారేడు దళముల ప్రదక్షణలు పూర్తి చేసుకున్న 15 మంది భక్త దంపతులు విగ్నేశ్వర పూజలో పాల్గొన్నారు. శివ సహస్రనామ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అభిషేక పండితులు భమిడిపాటి వెంకన్న జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాస్, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, పర్యవేక్షకులు పి వాసు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

పాలకొల్లు రైల్వే గేట్ వద్ద పనులు ప్రారంభం.

పాలకొల్లు:డిసెంబర్,9 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక రైల్వే గేట్ పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ పనులు ఈనెల 14వ తేదీ వరకు జరుగుతాయి. ఇందువల్ల పాలకొల్లు నుంచి భీమవరం వెళ్లే వాహనాలను పాలకొల్లు-భీమవరం బైపాస్ రోడ్డు వైపు మళ్ళించారు. ప్రజలు ప్రజలు ఇది గమనించి, తమకు సహకరించాలని రైల్వే శాఖ ఒక ప్రకటనలో కోరింది.

Read More

చలో విశాఖ జయప్రదం చేయాలి – సిఐటియు పిలుపు.

యలమంచిలి:డిసెంబర్,9 (తెలుగు న్యూస్ పేపర్) చలో విశాఖ జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. సంఘ నాయకులు దేవ సుధాకర్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వివిధ ప్రభుత్వ పథకాల అమలులో పాత్ర పోషిస్తున్న కార్మికులను సన్నద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా దొడ్డిపట్ల,యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కలిసి ప్రసంగించారు. ఈనెల 31 నుంచి వచ్చే ఏడాది, జనవరి,4 వరకు ఈ మహాసభలు జరుగుతాయి. అఖిలభారత స్థాయిలో విశాఖలో తొలిసారి ఈ సభ జరుగుతున్నది. కాశ్మీర్ నుండి…

Read More

శీతాకాలం టిబి తో జాగ్రత్త

పాలకొల్లు:డిసెంబర్,9(తెలుగు న్యూస్ పవర్) టీవీ మందులు తీసుకునేవారు శీతాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని లంకల కోడేరు ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నవ్య జీవన్ కోరారు. క్షయ వ్యాధి విముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ పాలకొల్లు అధ్యక్షులు, నిక్షయమిత్ర డాక్టర్ కోసూరి రామకృష్ణ ఆనంద రాజు, రోటరీ క్లబ్ సభ్యులు 20 మందికి టీబీ మందులు, పోషకాహారం కిట్లు అందజేశారు. శీతాకాలంలో చలికి బయట తిరగరాదని, క్రమం తప్పకుండా మందులు వాడితే త్వరలో పూర్తిగా కోలుకుంటారని…

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కాలేజీ విద్యార్థులకు శిక్షణ పూర్తి.

పాలకొల్లు,డిసెంబర్,9 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల చివరి సంవత్సరం విద్యార్థులకు వారం రోజులు పాటు నిర్వహించిన శిక్షణ తరగతులు మంగళవారం ముగిశాయి. ఈ శిక్షణ కార్యక్రమంలో ఉద్యోగం పొందడానికి అవసరమైన నైపుణ్యాలు నేర్పించారు. కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్, సాఫ్ట్ స్కిల్స్ పై శిక్షణ ఇచ్చారు. ఆంగ్లభాషా నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ సన్నాహక నైపుణ్యాలు,విద్యార్థులు వివిధ యాక్టివిటీస్ ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకున్నారనీ ట్రైనర్ ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ టి…

Read More

గర్భిణీ స్త్రీలు పోషకాహారం తీసుకోవాలి – డాక్టర్ కోసూరి రాజు

పాలకొల్లు:డిసెంబర్,9 (తెలుగు న్యూస్ పవర్) ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకంలో భాగంగా లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు ఎం నవ్య జీవన్ గర్భిణీ స్త్రీలకు పలు సూచనలు చేశారు. గర్భిణీ స్త్రీలకు ఎవరికైనా ప్రమాదకరమైన లక్షణాలు కనిపిస్తే తరచూ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రసవ సమయంలో ఏరియా ఆసుపత్రి స్త్రీ వ్యాధి నిపుణులనులను సంప్రదించాలని తెలియజేశారు. స్థానిక పాలకొల్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు, హోమియో వైద్యులు డాక్టర్ కోసూరి…

Read More

వాకర్స్ క్లబ్ ధన సహాయం

పాలకొల్లు:డిసెంబర్,9(తెలుగు న్యూస్ పవర్) స్థానిక వాకర్స్ క్లబ్ తరపున మూడేళ్ల బాలునికి వైద్య సహాయం నిమిత్తం 20వేల రూపాయలు బాధిత కుటుంబానికి అందజేశారు. పాలకొల్లు రూరల్ పంచాయతీ పరిధిలోగల యళ్ళవాని గరువుకు చెందిన మూడేళ్ల బాలుడు,గోగనమండ జడన్ పాల్ కు కాంక్లియర్ ఇంప్లాంట్స్ చేయవలసి ఉంది. వీరితో పాటు పాలకొల్లు,పెదపేటకు చెందిన నేతల ఎస్తేరు రాణి కీళ్లవ్యాధి నివారణ కోసం ఏడు వేల రూపాయల ఖర్చుతో మందులు కొనిచ్చారు. ఈ విధంగా సాయం చేయడం లో ఉన్న…

Read More

టెట్ పరీక్ష రద్దు కోసం నిరసన ర్యాలీ

పాలకొల్లు డిసెంబర్ 9 తెలుగు న్యూస్ పేపర్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం నిర్వహిస్తున్నామంటున్న టెట్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష పై తక్షణమే రద్దు ఉత్తర్వులు కోరుతూ పాలకొల్లు మంగళవారం ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ముందుగా ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాత, అమరజీవి చెన్నుపాటి లక్ష్మయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. అనంతరం ఇక్కడ నుంచి, టెట్ రద్దు కోరుతూ నినాదాలతో నిరసన ర్యాలీ…

Read More

లయన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ గా ముత్యాల రామారావు.

పాలకొల్లు:డిసెంబర్,9 (తెలుగు న్యూస్ పవర్) కృష్ణాజిల్లా లయన్స్ 316డి, జిల్లా, “లయన్ ఆఫ్ ద డిస్టిక్” అవార్డుకు, పాలకొల్లుకు చెందిన సీనియర్ పాత్రికేయులు ముత్యాల రామారావు ఎన్నికయ్యారు. ఈ అవార్డు 2024- 25 కు గాను విజయవాడలో ఆదివారం జరిగిన బహుమతి ప్రధానోత్సవం సభలో జిల్లా గవర్నర్,గద్దె శేషగిరిరావు అందజేశారు. ఇంటర్నేషనల్ ప్రెసిడెన్షియల్ అవార్డు కూడా వీరిని వరించింది. జిల్లా గవర్నర్ లయన్ వివిపిఎస్ ఆంజనేయులు సమక్షంలో, ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్, పి సుభాష్ బాబు ఈ…

Read More