Telugu News Power

కార్తీక మాసం లో ఓ ముఖ్యమైన ఘట్టం జ్వాలా తోరణం

  పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీరారమలిగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి జ్వాలా తోరణ కార్యక్రమం శాస్త్రోత్రంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అన్ని శైవ క్షేత్రాల్లో కార్తీక పౌర్ణమి రోజున జరుపుకుంటూరు. అయినా పంచారామ క్షేత్రాల్లో మాత్రం కృత్తిక నక్షత్రం రోజున జరుపుతారు. భక్తులు, ఆలయ ధర్మ కర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాస్, ధర్మ కర్తలు పినిశెట్టి శ్రీనివాస్, బసవ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది భక్తులకు జాగ్రత్తలు…

Read More

పాలకొల్లులో అల్లూరి సీతారామరాజు ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభము

భవిష్యత్తులో ఎందరో కళాకారులను తయారు చేయాలన్న తపనతో పూలపల్లిలో అల్లూరి సీతారామరాజు ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభిస్తున్నట్టు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఫిలిం ఇన్స్టిట్యూట్ బుధవారం మంత్రి లాంఛనంగా ప్రారంభించారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలకొల్లు కళలకు ,కళాకారులకు పుట్టిల్లు అన్నారు .అలనాటి అల్లు రామలింగం,దాసరి నారాయణరావు , రవిరాజ పినీశెట్టి, కోడి రామకృష్ణ ,రేలంగి నరసింహారావు నుంచి నేటి చేగొండి అనంత శ్రీరామ్ వరకు ఎందరో కవులు కళాకారులు ఈ పాలకొల్లు కీర్తి ప్రతిష్టలను…

Read More

అధికారులు సమావేశానికి రావాలి ఎంపీపీ ధనలక్ష్మి

యలమంచిలి మండల పరిషత్ సమావేశానికి సంబంధిత అధికారులు విధిగా హాజరుకావాలని అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి విజ్ఞప్తి చేశారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం సాయంత్రం,కార్యాలయ సమావేశం మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి సంబంధిత అధికారులు ఇంచుమించు అందరూ గైరహాజరయ్యారు. వివిధ కారణాలు చూపి వారి కార్యాలయ సిబ్బందిని సమాచారం లేకుండా, ఉన్న సభ్యులు సరిగ్గా వివరించలేకపోవడం వల్ల ఎంపీపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార మార్పిడి తరువాత బాధ్యతలు స్వీకరించిన ఎంపీపీ అధ్యక్షతన జరిగిన తొలి…

Read More

రసధుని సాహితీ సంస్థ, పాలకొల్లు వారి ఆధ్వర్యంలో కళాకారుల కార్తీకవనసమారాధన ద్వితీయ వార్షికోత్సవం

రసధుని సాహితీ సంస్థ, పాలకొల్లు వారి ఆధ్వర్యంలో కళాకారుల కార్తీకవనసమారాధన ద్వితీయ వార్షికోత్సవం స్థానిక కోకోనట్ బాలికల జూనియర్ కళాశాలలో జరిగింది. సంస్థ ప్రధాన కార్యదర్శి యర్రంశెట్టి వెంకటరత్నం, రత్నం దపతుల రాధా దామోదర పూజ కార్యక్రమంతో కార్యక్రమం ప్రారంభమైంది. పలు సంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. పలువురు కళాకారులను సత్కరించారు. పాలకొల్లు ప్రెస్ నిర్మానానికి పది వేల రూపాయల విరాళం ప్రెస్ క్లబ్ ప్రతినిధి సాంబశివ రావు కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నటగాన ప్రవీణ, పూర్వ…

Read More

ఈ ఆనందం మర్చిపోలేనిది మంత్రి నిమ్మల

నా జీవితంలో ఈ ఆనందం మర్చిపోలేనిదని స్థానిక ఎమ్మెల్యే మంత్రి నిమ్మల రామానాయుడు సంతోషం వ్యక్తం చేశారు. పాలకొల్లు లయన్స్ కమ్యూనిటీ హాల్ లో ఆదివారం రాత్రి జరిగిన డీఎస్సీ విజేతలకు అభినందన సభలో మంత్రి మాట్లాడారు. తన తండ్రి నిమ్మల ధర్మారావు పేరుమీద ఏర్పాటుచేసిన ట్రస్ట్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే, అనేక ప్రయాసలు పడి, రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు.నేను సహితం సమిధ నొక్కటి అంటూ ఎందరో…

Read More

డంపింగ్ యార్డ్లు ఇక మాయం! #news #telugu #nimmala #palakollu

  వచ్చే వేసవి నాటికి డపింగ్ యార్డులు మాయం. డంపింగ్ యార్డ్ ల సమస్య వచ్చే వేసవి నుంచి ఉండబోదని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. పాలకొల్లు ఫైర్ స్టేషన్ నుంచి పెనుమదం రోడ్డు వరకు సిమెంట్ రోడ్డు పనులకు శనివారం శ్రీనిధి రెస్టారెంట్ దగ్గర లో శంకుస్థాపన చేసారు.సుమారు కోటిన్నర రూపాయలు తో ఈ సీసీ రోడ్డు నిర్మించనున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడారు.ఎన్నో ఏళ్ళ…

Read More

ఘనంగా నాగుల చవితి #news #entertainment #telugu #palakollu

  దీపావళి తరువాత వచ్చే నాగుల చవితి శనివారం భక్తిశ్రద్ధలతో భక్తులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పొలాలు, తోటలు గుడులలో ఉన్న పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించారు. నాగదేవతల పుట్టల వద్ద మందులు కాల్చి, పటాసులు పీల్చారు. ఉదయం నుంచి భక్తులు నాగదేవతల పుట్టల వద్దకు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. పుట్టలు ఉన్న దేవాలయల వద్ద రద్దీ నెలకొంది. తక్షయజ్ఞంలో పడి నాగజాతి బూడిది కావటం ఆగిన సందర్భంగా ఈ నాగుల చవితి పండుగ చేసుకుంటారని…

Read More

పాలకొల్లు కు ఫిలిం ఇన్స్టిట్యూట్ #news #cinema #telugu #Palakollu

కళలకు పుట్టిల్లు పాలకొల్లు. పాలకొల్లు. కళాకారుల చిరకాల వాంఛ త్వరలోనే సాకారం కాబోతుంది. కాస్మోపాలిటన్ క్లబ్ అధ్యక్షులు, పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ పూర్వ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షతన పత్రికా విలేకరుల సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో ఏర్పాటు చేయబోయే ఫిలిం ఇన్స్టిట్యూట్ విశేషాలను వివరించారు. ఈ ఇన్స్టిట్యూట్ కు అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిలిం ఇన్స్టిట్యూట్ గా నామకరణం చేశారు. తొలి కార్యవర్గాన్ని ప్రకటించారు. కార్యనిర్వాహక కమిటీలో గౌరవ సలహాదారుగా…

Read More

కరెంటు సరఫరా లేకపోయినా పాలకొల్లులో నీటి సరఫరా ఆగదు -మంత్రి నిమ్మల

రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు కృషి తో మంచి నీటికి మహర్ధశ పట్టింది. ఇందుకుగాను దాదాపు కోటి డబ్బై లక్షల రూపాయల వ్యయం చేసారు. ముఖ్యంగా వాటర్ హెడ్వర్క్స్ ఏరియేటర్స్ కు 89.51లక్షల వెచ్చించారు. ఇక్కడే మరో40 లక్షల రూపాయలతో ముడినీటి పంపుహౌస్కు కు ఖర్చు చేశారు. కొత్త జనరేటర్ 40లక్షల రూపాయలతో ఏర్పాటు చేశారు. తరచుగా గాలికి, వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు మంచి నీటికి కటకటలాడకుండా నిరంతర మంచి నీటి సరఫరా…

Read More

సంక్రాంతి కానుకగా కాంబొంట్లపాలానికి సీ సీ రోడ్డు….#nimmala #Minister #Telugu #news

  రైతులు, బలహీనవర్గాల, వెనుకబడిన తరగతుల ప్రజలు మాత్రమే ఉండే ఈ గ్రామం అంటే తమకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. ఈ గ్రామంలో కోటి ఎనభై లక్షల రూపాయలతో వేయనున్న సి సీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేసి,సభ లో మాట్లాడారు. రోడ్డు పనులు వేగంగా పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ప్రజలకు అంకితం చేస్తామన్నారు. ఇక రహదారి నరకం నుంచి బయటపడతారన్నారు. ఈ ఒక్క ఏడాది లోనే ఈ గ్రామానికి సి సీ రోడ్డు వేయడానికి…

Read More