Skip to main content

Telugu News Power

రసధుని సాహితీ సంస్థ, పాలకొల్లు వారి ఆధ్వర్యంలో కళాకారుల కార్తీకవనసమారాధన ద్వితీయ వార్షికోత్సవం

రసధుని సాహితీ సంస్థ, పాలకొల్లు వారి ఆధ్వర్యంలో కళాకారుల కార్తీకవనసమారాధన ద్వితీయ వార్షికోత్సవం స్థానిక కోకోనట్ బాలికల జూనియర్ కళాశాలలో జరిగింది. సంస్థ ప్రధాన కార్యదర్శి యర్రంశెట్టి వెంకటరత్నం, రత్నం దపతుల రాధా దామోదర పూజ కార్యక్రమంతో కార్యక్రమం ప్రారంభమైంది. పలు సంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. పలువురు కళాకారులను సత్కరించారు. పాలకొల్లు ప్రెస్ నిర్మానానికి పది వేల రూపాయల విరాళం ప్రెస్ క్లబ్ ప్రతినిధి సాంబశివ రావు కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నటగాన ప్రవీణ, పూర్వ ప్రిన్సిపల్ చేగొండి సత్యనారాయ మూర్తి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు వంగా నరసింహారావు, కొట్టీ భాస్కర రావు, నాటక న్యాయ నిర్ణేత, రచయిత గంటా కళ్యాణ్ నాయుడు, వివిధ రంగాల ప్రముఖులు, మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం సంస్కృతి, సంప్రదాయం ప్రకారం జరిగింది.