Telugu News Power

మావుళ్ళమ్మ ఉండి లెక్కింపు.

భీమవరం: జనవరి,29(తెలుగు న్యూస్ పవర్) శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి హుండీ లెక్కింపు గురువారం జరిగింది. సుమారు, 59,25,412 నగదు, కానుకల ద్వారా మొక్కులు తీర్చుకున్న భక్తులు సమర్పించుకున్నారు. బంగారం 45.100గ్రాముల, వెండి 210 గ్రాములు భక్తులు హుండీలో వేశారు. వివిధ విదేశీ కరెన్సీ నోట్లు అమ్మవారికి భక్తులు సమర్పించుకున్నారు.

Read More

వెండి మకర తోరణం కానుక

పాలకొల్లు: జనవరి, 21, (తెలుగు న్యూస్ పవర్) స్థానిక, కుక్కల గుడి అనే రామాలయం దగ్గర వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో, స్వామివారికి 18 కేజీల వెండితో చేయించిన మకర తోరణాన్ని బంగారు కృష్ణ బాబు, నాగరాణి దంపతులు కానుక సమర్పించుకున్నారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనురుల శాఖ మాత్యులు, నిమ్మల రామానాయుడు, అమృత హస్తాలతో బుధవారం, స్వామివారికి అలంకరింప చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వెంకటేశ్వర స్వామి, పాలకొల్లుకే గాక…

Read More

నేడే యలమంచిలి, పుంతల ముసలమ్మ, మహా అన్నదానం.

యలమంచిలి: జనవరి,20(తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి, కుళాయి చెరువు వద్ద గల, శ్రీశ్రీశ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా, బుధవారం, సాయంత్రం, మాంసాహార వంటకాలతో మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇందులో 12 రకాల వంటకాలు భక్తులకు రుచి చూపనున్నారు.

Read More

క్షీరా రామలింగేశ్వర స్వామి వారికి, ఎకరా 75 సెంట్ల భూమి కానుకగా ఇచ్చిన,పోతురెడ్డి కామరాజు మనువమలు.

పాలకొల్లు: జనవరి,16(తెలుగు న్యూస్ పవర్) స్థానిక క్షీరారామలింగేశ్వర స్వామి వారికి, పూలపల్లి గ్రామానికి చెందిన పోతురెడ్డి కామరాజు, వారి మనుమలు ఎకరా 75 సెంట్ల భూమిని విరాళంగా ఇచ్చారు. స్వామివారి దర్శనం నిమిత్తం ఈ కానుక సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా భమిడిపాటి వెంకన్న అభిషేక పండితులచే, పార్వతీ పరమేశ్వరులకు, అర్చన పూజా కార్యక్రమాలు జరిపించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం భూమి కానుకగా ఇచ్చిన దాతలను శేష వస్త్రములతో ఆలయ అధికారులు సత్కరించారు. వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు….

Read More

లక్ష్మీ గణపతి హోమం

పాలకొల్లు: జనవరి, 6(తెలుగు న్యూస్ పవర్) స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం లక్ష్మీ గణపతి హోమం జరిగింది. ఏడు వారాలు, మారేడు దళ సప్త ప్రదక్షిణ పూర్తి చేసుకున్న భక్తులు విగ్నేశ్వర స్వామి వారి పూజ, శివ సహస్రనామం పూజలు చేశారు. భక్తిశ్రద్ధలతో భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అభిషేక పండిట్ భమిడిపాటి వెంకన్న, ప్రధాన అర్చకులు క్రిష్టప్ప ఈ పూజలు నిర్వహించారు.

Read More

లక్ష చామంతి పూజ

యలమంచిలి: జనవరి,4(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి వారి ఆలయంలో ఆదివారం గణపతి హోమం, స్వామివారి అభిషేకం, లక్ష చామంతి, తులసి పూజ జరిగింది. వెంప పండితులు సూరిబాబు, అర్చకులు వాడపల్లి కృష్ణమాచార్యులు వారి బృందం ఈ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ చిలుకూరి ఆంజనేయులు, ధర్మకర్తలు, వంటిపల్లి ప్రసాద్, పలువురు మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతోఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More

యలమంచిలి మండలంలో మంత్రి నిమ్మల పర్యటన

పాలకొల్లు,యలమంచిలి: జనవరి,4(తెలుగు న్యూస్ పవర్) రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, స్థానిక శాసనసభ్యులు నిర్మల రామానాయుడు, పాలకొల్లు, యలమంచిలి మండలాలలో ఆదివారం పర్యటించారు. పాలకొల్లు కమ్యూనిటీ ఆసుపత్రి డయాలసిస్ కేంద్రంలో అదనంగా మరో రెండు బెడ్లు ఏర్పాటు చేశారు. మంత్రి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు తో కలిసి వీటిని ప్రారంభించారు. ఆగర్రు లో పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు అందజేశారు. అనంతరం యలమంచిలి మండలంలో గుంపుర్రు వద్ద వల్లూరు మీడియం డ్రైన్ పై ఇన్ లెట్…

Read More

అమ్మవారికి భూరి విరాళం

యలమంచిలి: జనవరి, 4(తెలుగు న్యూస్ పవర్) స్థానిక కాపులపాలెం, కుళాయి చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి ఆదివారం పందిరి రాడు వేశారు. ఈ సందర్భంగా, తాళ్లూరి శ్రీనివాస్ (వైజాగ్ బుజ్జి) శిరీష దంపతులు అమ్మవారికి 4.59 లక్షల రూపాయల భూరి విరాళం సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చివటపు నాగేశ్వరరావు, కాసా సత్య, వీరబాబు,బొప్పన రాంబాబు, శనగల శ్రీనివాస్, కొడవటి శివరామకృష్ణ, ఆకుల యేసు, కాసా ఆంజనేయులు…

Read More

శ్రీవారి కళ్ళు ఎందుకు ఎరుపు

పాలకొల్లు: డిసెంబర్,3 (తెలుగు న్యూస్ పవర్) శ్రీవారి కళ్ళు ఎందుకు ఎరుపు రంగులో ఉన్నాయని, శ్రీదేవి కనులు ఎందుకు నల్లగా ఉన్నాయ తెలుసుకుంటే, లక్ష్మీదేవి మేని చాయ ఎర్రని ఎరుపు రంగులో ఉండటం వల్ల, శ్రీవారు, శ్రీదేవిని తదేకంగా చూస్తూ ఉండటం వల్ల, ఆ ఎరుపు శ్రీవారి కళ్ళల్లో ప్రతిబింబిస్తుందని, శ్రీదేవి, స్వామి వారు నీల మేఘశ్యాముడు కావడం వల్ల, ఎల్లప్పుడు ఆ స్వామివారి వీక్షించడం అమ్మవారి పద్మ పత్ర దళ నేత్రాలు నలుపుగా మారాయని, శ్రీదేవి,శ్రీవారి…

Read More

కళ్యాణోత్సవ తొలి సమావేశం

పాలకొల్లు, జనవరి,1(తెలుగు న్యూస్ పవర్) పార్వతీ సమేత క్షీరరామలింగేశ్వర స్వామి వారు, శ్రీ లక్ష్మీ సమేత జనార్ధన స్వామివార్ల కళ్యాణోత్సవ ఏర్పాట్లపై, గురువారం తొలి సమావేశం,అభిషేక మండపంలో జరిగింది. వచ్చే మార్చి ,27న నుంచి ఈ కల్యాణ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వీటిపై తొలి సమావేశం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, పాల్గొన్నారు.

Read More