Telugu News Power

అజరామరశక్తి ముద్రగడ -ప్రముఖుల ఘననివాళి

ముద్రగడుగు నివాళులు అర్పిస్తున్న ప్రముఖులు

పాలకొల్లు: జూలై,22( తెలుగు న్యూస్ పవర్. కామ్) మాజీ మంత్రి,, ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కు స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో బుధవారం పలువురు ప్రముఖులు ఘన నివాళి అర్పించారు. కాపు జాతి అభ్యున్నతి కోసం ముద్రగడ చేసిన సేవలను తలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముద్రగడ స్ఫూర్తి కాపులకు అజరామర శక్తి గా అభివర్ణించారు. కాపు విద్యార్థులకు ఉపకార వేతనాలు, కాపు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అమలులోకి రావటానికి ముద్రగడ చేసిన కృషి కారణమని పేర్కొన్నారు. భక్త ఆంధ్రప్రదేశ్లో ముద్రగడ సేవలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేనివన్నారు. ముచ్చర్ల శ్రీరామ్, ఎర్రంశెట్టి వెంకటరత్నం, వంగ నరసింహారావు, పూళ్ళ నాయుడు చవాకుల సూర్య నరేష్, తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, చినమిల్లి వెంకటరాయుడు, ఆరేటి ప్రకాష్, ఆకుల రామకృష్ణ, గడపల గోవిందరాజులు నాయుడు, వంగా నరసింహారావు, డాక్టర్ సంజయ్, చేగొండి ప్రకాష్, పెనుమాక రామమోహనరావు, జక్కంపూడి కుమార్, ఎడ్ల తాతాజీ, ఇంటి శ్రీరాముడు, అయ్యప్ప నాయుడు, గుండా రామకృష్ణ, కిర్లంపూడి నాగబాబు తదితరులు పాల్గొన్నారు.