Skip to main content

Telugu News Power

అద్దేపల్లి కళాశాలలో ఘనంగా గ్రంథ పాలకుల దినోత్సవం.

ఎస్ ఆర్ రంగంనాథన్ కు నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

పాలకొల్లు:ఆగస్టు,12( తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో గ్రంధాలయ విభాగం వారు జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. రత్న మాణిక్యం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా,మాట్లాడుతూ గ్రంథ పాలకుల దినోత్సవం ఎలా ఏర్పడింది, గ్రంథాలయాల వినియోగంలో డిజిటల్ లైబ్రరీ పాత్ర , డిజిటల్ కంటెంట్ ప్రస్తుతం వాడుతున్న విధానాన్ని విద్యార్థులకు తెలియజేశారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ టి కృష్ణ మాట్లాడుతూ, గ్రంథాలయంలో గల వనరులను విద్యార్థులందరూ వినియోగించుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంధపాలకులు వి.వి.సిహెచ్.రమేష్ మాట్లాడుతూ,ఎస్ఆర్ రంగనాథన్ యొక్క గొప్పతనాన్ని, ఆయన జయంతిని గ్రంథపాలకుల దినోత్సవం గా జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకడమిక్ కోఆర్డినేటర్ జి. సుమలత, ఐ క్యూ ఏ సీ కోఆర్డినేటర్ బి వెంకటస్వామి, ఇంగ్లీష్ విభాగాధిపతి కె. శామ్యూల్, ఇతర అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థినీ విద్యార్థులుపాల్గొన్నారు.