పాలకొల్లు: ఆగస్టు,20( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రావణ మాస, గురువారం, నరసాపురం కెనాల్ రోడ్ లో గల పెద్ద సాయిబాబా ఆలయంలో రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు, పూలపల్లి అభివృద్ధి ప్రదాత గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు దంపతులు సాయిబాబా కు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా, భారీగా తరలివచ్చిన భక్తులకు నవకాయ పిండి వంటలతో అన్న ప్రసాద వితరణ చేశారు. గాంధీ భగవాన్ రాజు, సుశీల దేవి, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు (బూన్ రాజు) దంపతులు, ఇందుకూరు వెంకటరామరాజు, కలిదిండి గణపతి రాజు, కిరణ్ వర్మ, అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డన చేశారు. ఈ సందర్భంగా గాంధీ రాజు మాట్లాడుతూ, అన్నదాన వితరణ భాగ్యం, సాయిబాబా ఇచ్చిన వరంగా భావిస్తున్నానని,ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వామి కావటం తమకు, కుటుంబ సభ్యులకు ఆధ్యాత్మిక, ఆనంద అనుభూతి కలిగిందని, ఈ అవకాశం ఇచ్చిన సాయిబాబా మహారాజుకు, దేవస్థానం వారికి రాజు కృతజ్ఞతలు తెలిపారు.
అన్నదాన వితరణ భాగ్యం, సాయిబాబా ఇచ్చిన వరం. -గాంధీ భగవాన్ రాజు
సాయిబాబాకు పూజలు నిర్వహిస్తున్న భగవాన్ రాజు సుశీల దేవి దంపతులు