భీమవరం: జూన్,30( తెలుగు న్యూస్ పవర్. కామ్) నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం, తూర్పుగోదావరి జిల్లా రైలు ప్రయాణికులకు, అరుణాచలం వెళ్లే భక్తులకు రైలు అందుబాటులోకి వచ్చింది. స్థానిక లోక్ సభ సభ్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ కృషితో రైలు సౌకర్యం నేటి నుంచి అందుబాటులోకి రానుంది.నియోజకవర్గ ప్రజల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఇప్పటివరకు ప్రత్యేక (స్పెషల్) రైలుగా నడిచిన నర్సాపురం – అరుణాచలం ఎక్స్‌ప్రెస్ ఇకపై పూర్తిస్థాయి రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మేరకు రైల్వే శాఖ పూర్తి అనుమతులు మంజూరుచేసింది.
పవిత్ర అరుణాచల క్షేత్రానికి (తిరువణ్ణామలై) వెళ్లే భక్తుల సౌకర్యార్థం, ఈ రైలు తొలి రెగ్యులర్ సర్వీస్ ను నేటి
మధ్యాహ్నం ప్రారంభిస్తున్నారు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ లో నేటి మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు పచ్చ జండా ఊపి ప్రారంభిస్తారు.రైలు
ప్రయాణ మార్గం,పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, గుడివాడ, విజయవాడ మీదుగా నడుస్తుంది.ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి, ఆధ్యాత్మిక యాత్రలను సులభతరం చేయడానికి ప్రభుత్వం ఈరోజు సౌకర్యం కల్పించినట్టు ఎంపీవర్మ తెలిపారు. భక్తులు, ప్రయాణికులు ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఎంపీ కోరారు. ఈ రైలు ప్రత్యేక రైలుగా నడవటం వల్ల ప్రయాణికులు ఎప్పుడు నడుస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో తెలియని అని చేత పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ ఇబ్బందులకు తావు లేదు. ప్రత్యేక రైలుగా నడపడం వల్ల టిక్కెట్టు ధర హెచ్చుగా ఉండేది. ఈ రైలు ప్రయాణానికి టిక్కెట్టు ధర కూడా దిగివచ్చి, ఇప్పుడు సామాన్యునికి కూడా అందుబాటులోకి వస్తుందని రైల్వే వర్గాలు తెలిపాయి.
అరుణాచలానికి వీక్లీ ఎక్స్‌ప్రెస్ నేడే ప్రారంభం.