Skip to main content

Telugu News Power

అల్లు శిరీష్ దంపతులకు ఎపి సీఎం చంద్రబాబు దీవెనలు.

శిరీష్ , నైనిక దంపతులను ఆశీర్వదిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

హైదరాబాద్: మార్చి, 15,(తెలుగు న్యూస్ పవర్. కాం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం హైదరాబాదులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గృహంలో ఇటీవల వివాహమైన అల్లు శిరీష్, నైనిక దంపతులను ఆశీర్వదించారు. అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు సీఎం సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా, స్టైలిష్ స్టార్, పాన్ ఇండియా స్టార్, అల్లు అర్జున్, ఇతర దేశాలలో ఉండటం వల్ల తన ఎక్స్ ఖాతా ద్వారా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కలయిక సోషల్ మీడియాలో వైరల్ అయింది.