
పాలకొల్లు: జులై, 4( తెలుగు న్యూస్ పవర్. కామ్) అల్లూరి ఆశయాలను ముందు తరాలకు అందించడానికి కృషి చేస్తామని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 129 జయంతి ఉత్సవాలు స్థానిక పెనుమత్స సత్యనారాయణ రాజు, సూర్య పద్మావతి క్షత్రియ సంక్షేమ పరిషత్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బ్రతికితే అల్లూరి సీతారామరాజుల బతకాలని అనిపించేలా అల్లూరి సీతారామరాజు చరిత్ర గురించి తెలుసుకున్నట్టు వెల్లడించారు. దేశమాత స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం త్యాగం చేసిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. స్థానికంగా అల్లూరి సీతారామరాజు విగ్రహం లేకపోవటంతో తాను ఎమ్మెల్యేగా ఎంపికైన వెంటనే పాలకొల్లు నడిబొడ్డున సముచిత స్థానం కల్పిస్తూ వారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, అల్లూరి జీవితం ధైర్య సాహసాలకు, త్యాగాలకు ప్రతీకగా పేర్కొన్నారు. మాజీ ఎంపీ, మంత్రి కొలుమూరి బాపిరాజు మాట్లాడుతూ, మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపి ఆక్వా రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గాంధీ భగవాన్ రాజుకు ఘన సత్కారం.
అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా శనివారం, క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపంలో, స్థానిక కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరిగిన భారీ కార్యక్రమంలో గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, సుశీల దంపతులను ఘనంగా సత్కరించారు. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు,కేంద్ర సహాయ మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ, స్థానిక ఎమ్మెల్యే మంత్రి నిమ్మల రామానాయుడు, కొలువురు క్షత్రియ ప్రముఖుల సమక్షంలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, పూలపల్లికి అభివృద్ధి ఫలాలు అందజేస్తున్న గాంధీ భగవాన్ సేవలను కొనియాడారు. గాంధీ మెగా ఫౌండేషన్ స్థాపించి, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ప్రతిష్టాత్మక కాస్మోకల్చరల్ క్లబ్ అధ్యక్షులుగా క్లబ్బు ప్రగతికి పోటుపడుతూ, మీ అందరితో సహాయం అందిస్తున్నారని వెల్లడించారు. జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులుగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం రాష్ట్ర అధ్యక్షుని వరకు సాగిందన్నారు. ఆక్వా రైతుల కోసం నిరంతరం ఎన్నో ఉద్యమాలు తన భుజస్కందాలపై వేసుకొని, అనితర సాధ్యమైన పోరాటం చేస్తున్నారని, వారి ధైర్య సాహసాలను ప్రశంసించారు. పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా రైతులకు వారు చేసిన సేవలు మరిచిపోలేనివి అన్నారు. కలలకు పుట్టిల్లు అయిన పాలకొల్లుకు అల్లూరి సీతారామరాజు ఫిలిం ఇన్స్టిట్యూట్ రావడంలో భగవాన్ రాజు కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. పోలపల్లిలో మహాదేవుని ఆలయ నిర్మాత గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, సుశీల ఆదర్శ దాంపత్యం ఆది దంపతులు శివపార్వతుల వలె కలకాలం కొనసాగాలని వక్తలు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో క్షత్రియ పరిషత్ నాయకులు, మాంటిసోరిస్ విద్యాసంస్థల అధినేత కేవీ కృష్ణ వర్మ, డాక్టర్ వర్మ, చేరుకూరి సూరిబాబు, డిటిడిసి బాబు,కె.వి రామకృష్ణంరాజు, జి ఎస్ వి ఆర్ సూర్యనారాయణ రాజు(బూన్ రాజు), వీవీ సోమరాజు, తదితర ప్రముఖులు, క్షత్రియ సోదర సోదరీమణులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
