Telugu News Power

ఈనెల 23న దివ్యాంగజన్ జాబ్ మేళా- కలెక్టర్ నాగరాణి.

కలెక్టర్ నాగరాణి

వేదిక: దాసరి నారాయణరావు మహిళ కళాశాల, పాలకొల్లు.

భీమవరం: జూలై 17( తెలుగు న్యూస్ పవర్. కామ్)
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగజన్ జాబ్ మేళా ఈ నెల 23న పాలకొల్లు డిఎన్ఆర్ మహిళ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రైవేట్ సంస్థలు పాల్గొంటున్నాయన్నారు. పదవ తరగతి ఇంటర్మీడి యట్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, అంతకంటే పై అర్హతలు కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు. నెలకు రూ.12వేల నుంచి రూ.30వేల వరకు వేతనాలు ఉంటాయని వివరించారు. చెవిటి, మూగ, చెవిటి, స్వల్ప లోకోమోటర్, లోకోమోటర్ దివ్యాంగులకు అనువైన ఉద్యోగ అవకాశాలు కల్పించ నున్నట్లు తెలిపారు. 170 దివ్యాంగుల ఖాళీలు, 130 సాధారణ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరిన్ని వివరాలకు 7330803719 9492885556 సంప్రదించవచ్చని తెలిపారు.