Skip to main content

Telugu News Power

నరసాపురం – చెన్నై, మధురై పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త

కృతజ్ఞతలు తెలుపుతున్న నాగేంద్ర కుమార్

నరసాపురం: ఆగస్టు, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్)
నరసాపురం – ట్యూటికోరిన్ మధ్య వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్

నరసాపురం నుండి చెన్నై, మధుర మీదుగా ట్యూటికోరిన్ వరకు కొత్తగా వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్(06019/06020) ను రైల్వే శాఖ మంజూరు చేసింది.
ఈ రైలు వచ్చే నెల 7వ తేదీ నుంచి నెలాఖరు వరకు వారంలో ఒక రోజు నడవనుంది. ఈ రైలు29 స్టేషన్లలో ఆగుతుంది.

1. 06019 – ట్యూటికోరిన్ ఎక్స్‌ప్రెస్ (డౌన్)ప్రతి సోమవారం (తేదీలు 7, 14, 23, 30) రాత్రి 11:30 గం.లకు ట్యూటికోరిన్ నుంచి బయలుదేరి, బుధవారం రాత్రి 12:00 గం.లకు నరసాపురం చేరుకుంటుంది.
2. 06020 – నరసాపురం ఎక్స్‌ప్రెస్ (ఎగువకు)
ప్రతి బుధవారం (తేదీలు 9, 16, 23, 30) ఉదయం 4:00 గం.లకు నరసాపురం నుంచి బయలుదేరి, శుక్రవారం తెల్లవారుజాము 4:00 గం.లకు ట్యూటికోరిన్ చేరుకుంటుంది.
రైలు నడిచే మార్గం: నరసాపురం – భీమవరం – ఆకివీడు – కైకలూరు – చెన్నై -ఎగ్మూర్ (తెల్లవారు 3 గం.లు) – విల్లుపురం – చిదంబరం – కుంభకోణం – తంజావూరు – తిరుచురాపల్లి – దిండిగల్ – కొడైకెనాల్ రోడ్డు – మధురై – ట్యూటికోరిన్. ఈ రైలు వలన మధురై, చిదంబరం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికులకు, విద్యార్థులకు, వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుంది.
ప్రస్తుతం ఈ రైలుకు మన జిల్లాలో భీమవరం, ఆకివీడు, కైకలూరు లో మాత్రమే
ఆగుతుంది. పాలకొల్లు పరిసర ప్రాంత భక్తులు, ప్రజల సౌకర్యార్థం పాలకొల్లు స్టేషన్లో కూడా ఎగువ, దిగువ రెండు వైపులా ఈ ట్రైన్ ఆగే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ కు , రైల్వే అధికారులను ప్రయాణికులు కోరుతున్నారు. ప్రధానమంత్రి, నరేంద్ర మోడీ, కేంద్ర రైల్వే మంత్రి, అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ, దక్షిణ కోస్తా రైల్వే అధికారులకు, ప్రయాణికుల తరపున డి యూ ఆర్ సి సి సభ్యులు జక్కంపూడి లక్ష్మీ నరసింహ నాగేంద్ర కుమార్ ధన్యవాదాలు తెలిపారు.