Telugu News Power

ఉభయగోదావరి జిల్లాలలో కలకలం రేపిన యువతి హత్య.

కేసు గురించి వివరిస్తున్న పోలీసులు

నర్సాపురం: జూన్, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టపగలు జరిగిన యువతి హత్య పట్టణంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సూళ్లూరుపేటలో ఏఎన్ఎం శిక్షణ పొందుతున్న జాలెం షైనీ రోజా రైలులో నరసాపురం సోమవారం చేరుకుంది. స్వగ్రామం అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి కార్లో ప్రయాణం అయింది. కారు సురేష్ నడుపుతున్నాడు. మార్గమధ్యలో మార్గాని రమేష్ కారులోకి ఎక్కాడు. స్థానిక పెట్రోల్ బంకు సమీపంలో మంచి నీటి కోసం కారు నడుపుతున్న సురేష్ దిగి బయటకు వెళ్ళాడు. ఇది అదునుగా భావించిన నీ మిత్రుడు రమేష్ రోజాను భుజం పైన బట్టలు కత్తితో పొడిచాడు. అడ్డుపడిన సురేష్ పై కూడా దాడికి తెగపడ్డాడు. వీరిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. నరసాపురం డిఎస్పి సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.