Telugu News Power

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో ఘనంగా జీఎస్టీ 9వ వార్షికోత్సవం.

జిఎస్టి తొమ్మిదో వార్షికోత్సవ సమావేశంలో మాట్లాడుతున్న ప్రిన్సిపల్

పాలకొల్లు: జూలై,1( తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల లో బుధవారం వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) 9వ వార్షికోత్సవం సందర్భంగా “సులభ పన్ను వ్యవస్థ – సశక్త భారతదేశం” అనే నినాదంతో జీఎస్‌టీ దినోత్సవాన్ని వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రత్నమణిక్యం అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు జీఎస్‌టీ ఆవిర్భావం, గత తొమ్మిదేళ్లలో సాధించిన పురోగతి, జీఎస్‌టీలో జరిగిన తాజా సవరణలు, వాటి ప్రాముఖ్యత, వ్యాపార రంగంలో జీఎస్‌టీ పాత్ర, పన్నుల వ్యవస్థను సరళీకృతం చేయడంలో జీఎస్‌టీ ప్రాధాన్యం, దేశ ఆర్థికాభివృద్ధిలో జీఎస్‌టీ యొక్క కీలక పాత్ర గురించి అధ్యాపకులు అవగాహన కల్పించారు. విద్యార్థులు కార్యక్రమంలో ఆసక్తిగా పాల్గొని జీఎస్‌టీపై తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటు పన్నుల వ్యవస్థపై తమ అవగాహనను మరింత మెరుగు పరచుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ టి. కృష్ణ, వాణిజ్య విభాగ అధ్యాపకులు డి. మన్మధరావు, బి. ఆశాజ్యోతి, సి హెచ్. రవికుమార్, కె. రోహిత్, ఇతర అధ్యాపకులు, విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.