Skip to main content

Telugu News Power

ఏ ఎస్ ఎన్ ఎమ్ డిగ్రీ కళాశాలలో ఇప్పుడే చేరండి.

పాలకొల్లు:అక్టోబర్,21(తెలుగు న్యూస్ పవర్. కామ్)
శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి,ప్రభుత్వ డిగ్రీ, అటానమస్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో చేరడానికి, సీట్లు అందుబాటులో ఉన్నాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే రత్న మాణిక్యం బుధవారం తెలిపారు. ఇంటర్మీడియట్ లేదా సమానమైన విద్యార్హతలు గల విద్యార్థులు కళాశాలను సంప్రదించి అందుబాటులో ఉన్న కోర్సులుకు హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా దరఖాస్తు చేసుకొనవచ్చని తెలిపారు.

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకావాలని కోరారు. విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఈ నెల 24 నుంచి 26 వరకు జరుగుతాయి. అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఈ నెల 26 నుంచి 27 వరకు నమోదు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్ లో మార్పులు చేసుకునే గడువు ఈ నెల 28 వరకు ఉంది. సీట్ల కేటాయింపు ఈ నెల 30తో ముగుస్తుంది. నిర్ణీత తేదీల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.