భీమవరం:జూలై, 2(తెలుగు న్యూస్ పవర్.కామ్)
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా 2026–27 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలు ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జూన్ 12 నుంచి జూలై 30, 2026 వరకు సాధారణ ఫీజుతోను, ఆగస్టు 2 నుంచి 15 వరకు రూ.200 అపరాధ రుసుముతోను దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. చదువు మధ్యలో నిలిపివేసిన విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు తదితరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఓపెన్ స్కూల్ ప్రవేశాలు ప్రారంభం, అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ నాగరాణి పిలుపు. .