Skip to main content

Telugu News Power

కాపు అనిత క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన బ్యానర్ల ఆవిష్కరణ.

సామాజిక అవగాహన పై బ్యానర్లు ఆవిష్కరణ

పాలకొల్లు: జులై, 1( తెలుగు న్యూస్ పవర్. కామ్)
సామాజిక అవగాహన కార్యక్రమాల్లో భాగంగా స్థానిక, యునైటెడ్ కాపు క్లబ్ (యూకేజీ) కాపు వనిత సర్వీస్ క్లబ్, బుధవారం ప్రజలను జాగరూకపరిచే ఉద్దేశంతో వివిధ రకాల బ్యానర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పట్టణ సీఐ రజిని కుమార్, డాక్టర్ సంజయ్, రీజనల్ చైర్మన్ అరుణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వాహనాలు నడిపేటప్పుడు సెల్ఫోన్ మాట్లాడరాదని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని బ్యానర్లలో సూచించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, పర్యావరణహితమైన వస్తువులు మాత్రమే వాడాలని బ్యానర్లు వేయించారు. వీటిని ప్రముఖ కోడళ్ళలో ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం కాపు మహిళను చేపట్టారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అప్పారావు కానూరు ప్రభాకర్కు సీఐ రజిని కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. క్లబ్బు అధ్యక్ష, కార్యదర్శి కోశాధికారులు డాక్టర్ కావలి మౌని, కటికి అర్చన, తోట గాయత్రి పలువురు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.