Skip to main content

Telugu News Power

కారుమూరు ని కలిసిన మార్గాని భరత్.

కారుమూరి ని కలిసిన మార్గాని భరత్

హైదరాబాద్: జూలై,1( తెలుగు న్యూస్ పవర్.కాం.)
వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్ కారుమూరి సునీల్ కుమార్ ను ఇటీవల అరెస్టు చేశారు.ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును బుధవారం కలిశారు. పార్ట్ లో క్రియాశీలకంగా పనిచేస్తున్న సునీల్ ను అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వం కుట్రలో భాగమే నని భరత్ ఆరోపించారు. త్వరలో బయటకు వచ్చి పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని భరత్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నాగేశ్వరరావుకు ధైర్యం చెప్పారు.

కూటమి ప్రభుత్వం అరాచక పాలన కు ప్రజలే తగిన శాస్తి చెబుతారని భరత్ హెచ్చరించారు. పలువురు వైసీపీ సీనియర్ నాయకులు కారుమూరిని పరామర్శించారు.