Skip to main content

Telugu News Power

కొత్త పింఛన్లు కోసం వినతి.

సామాజిక శంఖారావం కార్యక్రమంలో నిర్వహిస్తున్న వామపక్ష నాయకులు

పాలకొల్లు: ఆగస్టు,13( తెలుగు న్యూస్ పవర్. కామ్) కొత్తవారికి పింఛన్లు మంజూరు చేయాలని పూర్వ ఆచంట శాసనసభ్యులు, కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు దిగుపాటి రాజగోపాల్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండున్నర ఏళ్లవుతున్నప్పటికీ ఒక్క పింఛన్ కూడా కొత్తగా మంజూరు చేయలేదని ఆరోపించారు. అర్హులైన వారికి వెంటనే పింఛన్లు మంజూరు చేయటానికి ప్రభుత్వం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో నేటికీ కుల వివక్షత కొనసాగుతుందని ఆరోపించారు. అరట్లకట్ల, వడలివానిపేట దళితుల స్మశాన వాటిక సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యానాదుల కోసం దగ్గులూరు లో వేసిన షెడ్లు చాలా అద్వాన స్థితిలో ఉన్నాయని దిగుపాటి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలకు సంబంధించి గురువారం స్థానిక తాహశీల్దార్ యడ్ల దుర్గా కిషోర్ కు వినతిపత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, జిల్లా అధ్యక్షులు బాతిరెడ్డి జార్జి, ఏ. రవి, యర్రా అజయ్ కుమార్, బి. సుగుణ, చల్ల సోమేశ్వరరావు,ఏ. రాము, మల్లుల గణపతి, తిరుమాని శ్రీను తదితరులు పాల్గొన్నారు.