Telugu News Power

క్యాన్సర్ మరణశిక్ష కాదు. ఆ భయాన్ని మర్చిపోండి. ప్రపంచ ప్రసిద్ధ ఆంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయుడు పిలుపు. ఈ ఏడాది 15 లక్షల క్యాన్సర్ కేసులు ఐ సి ఎం ఆర్ ప్రకటన.

డాక్టర్ నోరి దత్తాత్రేయుడు

జనరల్ డెస్క్: జూలై,7
( తెలుగు న్యూస్ పవర్. కామ్) క్యాన్సర్ ఇక ఎంత మాత్రం మరణశిక్ష కాదని ప్రపంచ ప్రసిద్ధ క్యాన్సర్ వ్యాధి నిపుణులు నోరి దత్తాత్రేయుడు పేర్కొన్నారు. ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాన్సర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఏడాది 15 లక్షల కొత్త క్యాన్సర్ రోగులు పుట్టుకొస్తారని ఇండియన్ హోల్ సేల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐ సి ఎం ఆర్) నిర్ధారణకు వచ్చినట్టు ప్రకటించారు. క్యాన్సర్ గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. క్యాన్సర్ వ్యాధి రోగస్తులు 65 శాతానికి పైగా ఆ రోజు నుంచి బయటపడుతున్నట్టు తెలిపారు. క్యాన్సర్ వ్యాధి మూడు, నాలుగు దశలకు చేరుకున్నప్పటికీ వైద్యం అందించవచ్చు అని వివరించారు. క్యాన్సర్ లక్షిత వైద్య సేవలు, ఇమ్యునో థెరపీ విధానం వల్ల ఇది సాధ్యపడుతుందన్నారు. చికిత్స పొందిన క్యాన్సర్ రోగులు దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ వ్యాధి నిర్మూలనకు సమగ్రంగా, సమూలంగా నిర్మూలించడానికి ప్రభుత్వంతో పాటుపౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు ఎందుకు వచ్చి ఉద్యమాన్ని నడవాలని పిలుపునిచ్చారు. రోగానికి విరుగుడు ముందుగా వ్యాధిని గుర్తించడమే అన్నారు. అనుమానం వచ్చినవారు వెంటనే పరీక్షలు చేయించుకుంటే వారు మామూలుగా జీవనం సాగించటానికి అవసరమైన అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.