Skip to main content

Telugu News Power

క్షీరా రామంలో సప్తప్రదక్షణలు

స్థానిక పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద సోమవారం ఏడు మారేడు దళములతో మాడ వీధులలో భక్తులు సప్త ప్రదక్షిణాలు చేశారు. ప్రదక్షిణలో సుమారు 250 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు,ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప, సూపరిండెంట్ పి. వాసు , ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.రాత్రి దూప సేవ, శ్రీ స్వామి వారి పంచాహారతుల సేవ జరిగింది.
కార్యనిర్వాహణాధికారి ముచ్చెర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.