Telugu News Power

గ్రామీణ పాత్రికేయుల శిక్షణా కార్యక్రమం ప్రారంభం.

శిక్షణ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఆలపాటి, దేవగళ్ళ

పాలకొల్లు: జూన్, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) గ్రామీణ విలేకరుల వృత్తి శిక్షణ కార్యక్రమం శనివారం స్థానిక కిరణా మర్చంట్ అసోసియేషన్ హాల్లో ప్రారంభమైంది. గ్రామీణ విలేకరుల వృత్తి నైపుణ్యాల పెంపొందించుకోవటానికి పలువురు ప్రముఖులు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో, ఆలపాటి సురేష్ కుమార్, దేవగళ్ళ రామకృష్ణ, కుర్రా విజయకుమార్, ఎస్ గురునాథ్, ఎస్ శ్రీనివాసు జీవన్, ముత్యాల శ్రీనివాస్, పలువురు పాత్రికేయులు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.