పాలకొల్లు: ఆగస్టు, 11( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బి ఆర్ ఆర్, జి కే ఆర్ ఛాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల ఈ 11- నుంచి 20 వరకు ఆధార్ నవీకరణ ప్రత్యేక శిబిరం, కమిషనర్ వారి ఆదేశాలు మేరకు నిర్వహిహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఈ ఆధార్ కార్డు నమోదు లో మార్పులు చేర్పులు చేయుటకు కళాశాల విద్యార్థిని విద్యార్థులతో పాటు, కళాశాల పరిసర ప్రాంత బ్రాడీపేట,పూలపల్లి, ఎల్ ఆర్ పేట, నాగరాజు పేట, హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రాంతవాసులు, ఈ సదవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా కొరారు. ఈ సందర్భంగా, కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు మాట్లాడుతూ, 15 ఏళ్లు నిండిన పిల్లలు ఆధార్ నమోదులో మార్పులు చేర్పులు చేయించుకోవాలనే అవగాహన లోపించుటచే చాలామంది వారి పిల్లల యొక్క వివరాలను నవీకరించక పోవడంతో కమీషనర్ వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని కళాశాలలో నిర్వహింస్తున్నట్టు తెలిపారు.
ఛాంబర్స్ కళాశాల ప్రాంగణంలో ఆధార్ నమోదు కేంద్రం ప్రారంభం.
ఛాంబర్స్ కళాశాలలో ప్రారంభమైన ఆధార్ నమోదు కేంద్రం